మూడు లక్షల పశువులకు మందులు వేస్తాం
ABN , First Publish Date - 2020-12-16T05:00:38+05:30 IST
జిల్లావ్యాప్తంగా మూడు లక్షల పశువులకు ఉచితంగా నట్టల వ్యాధి నివారణ మందును వేస్తున్నామని జిల్లా పశువైద్యా ధికారి డాక్టర్ ఎల్లన్న అన్నారు.

ఆర్మూర్‌రూరల్, డిసెంబరు15: జిల్లావ్యాప్తంగా మూడు లక్షల పశువులకు ఉచితంగా నట్టల వ్యాధి నివారణ మందును వేస్తున్నామని జిల్లా పశువైద్యా ధికారి డాక్టర్ ఎల్లన్న అన్నారు. అంకాపూర్‌లో మంగళవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం గోజాతి, గేదేజాతి పశువులకు నట్టల నివారణ మందు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కిశో ర్ రెడ్డి, ఎంపీటీసీ మహేందర్, అధికారి లక్కం ప్రభాకర్ పాల్గొన్నారు.