వేతన సవరణ చేపట్టాలని నిరసన
ABN , First Publish Date - 2020-12-11T04:38:40+05:30 IST
వేతన సవరణ చేపట్టాలని ఎల్‌ఐసీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీ కార్యాల యం వద్ద గురువారం ఉద్యోగులు నిరసన చేపట్టారు.

కామారెడ్డిటౌన్, డిసెంబరు 10: వేతన సవరణ చేపట్టాలని ఎల్‌ఐసీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీ కార్యాల యం వద్ద గురువారం ఉద్యోగులు నిరసన చేపట్టారు. మూడు సంవత్సరా ల నుంచి వేతన సవరణ చేపట్టడం లేదని, సంస్థను తాము లాభాల బా టలో నడిపిస్తున్నా యాజమాన్యం మాత్రం తమకు న్యాయం చేయడం లేదన్నారు. సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కారం చూపకపోతే ఈనెల 22న మరోసారి నిరసనకు దిగుతామని తెలిపారు. ఈ కార్యకరమంలో క్లాస్‌వన్ అసోసియోషన్ శ్రీధర్, డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ అసోసియోషన్ మారుతి, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.