అక్రమ వసూళ్లకు ప్రైవేటు సైన్యం
ABN , First Publish Date - 2020-11-25T05:06:26+05:30 IST
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రభుత్వ రంగ సం స్థలకు చెందిన శాఖలు అవినీతిలో కూరుకుపోతున్నాయి. గ తంలో ఆర్టీవో కార్యాలయాలు, చెక్‌పోస్టుల వద్ద అధికారులు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటుచేసుకుని మరీ అక్రమ వసూళ్ల కు పాల్పడుతుండేవారు. ఆ శాఖలో ఇప్పటికీ ఆ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. అలాగే, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో నూ ఆ శాఖ అధికారులు దళారులు, మధ్యవర్తులను ప్రోత్స హిస్తూ ముడుపులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సం ఘటనలూ ఎన్నో ఉన్నాయి. అలాంటి సంస్కృతి ఇప్పుడు పో లీసు శాఖకూ విస్తరించింది. అవినీతి, అక్రమాలను నిర్మూలి ంచి.. చట్టాలను కాపాడుతూ.. నేరస్తులను శిక్షించాల్సిన రక్షక భటులలోనే కొంతమంది మామూళ్ల వసూళ్లకు దళారులు, మధ్యవర్తులను నియమించుకుంటున్నారు.
పోలీసు శాఖలో అక్రమ వసూళ్లకు మధ్యవర్తులు
గతంలో ఆర్టీవో, రిజిస్ట్రేషన్, రెవెన్యూలో కొనసాగిన తంతు
కామారెడ్డిలో క్రికెట్ బెట్టింగ్ కేసుతో రుజువైన వైనం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏసీబీకి పట్టుబడిన ముగ్గురు సీఐలది ఒకే బ్యాచ్!
పైకి సేవా కార్యక్రమాలు.. అంతర్గతంగా అక్రమ వసూళ్లు
కామారెడ్డి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రభుత్వ రంగ సం స్థలకు చెందిన శాఖలు అవినీతిలో కూరుకుపోతున్నాయి. గ తంలో ఆర్టీవో కార్యాలయాలు, చెక్‌పోస్టుల వద్ద అధికారులు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటుచేసుకుని మరీ అక్రమ వసూళ్ల కు పాల్పడుతుండేవారు. ఆ శాఖలో ఇప్పటికీ ఆ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. అలాగే, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో నూ ఆ శాఖ అధికారులు దళారులు, మధ్యవర్తులను ప్రోత్స హిస్తూ ముడుపులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సం ఘటనలూ ఎన్నో ఉన్నాయి. అలాంటి సంస్కృతి ఇప్పుడు పో లీసు శాఖకూ విస్తరించింది. అవినీతి, అక్రమాలను నిర్మూలి ంచి.. చట్టాలను కాపాడుతూ.. నేరస్తులను శిక్షించాల్సిన రక్షక భటులలోనే కొంతమంది మామూళ్ల వసూళ్లకు దళారులు, మధ్యవర్తులను నియమించుకుంటున్నారు. ఇటీవల కామా రెడ్డిలో ఏకంగా కొందరు పోలీసు అధికారులే మామూళ్ల వ సూళ్లకు మధ్యవర్తులను నియమించుకొని, బెట్టింగ్ కేసులో పట్టుబడిని వారిపై కేసులు నమోదు చేయకుండా బేరాలు మాట్లాడుకొని బాధితులను పెద్ద మొత్తంలో డబ్బులు చేసి చివరికి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
పోలీసులకు మామూళ్లు షరామామూలే
ప్రతీ కేసుకు ఒక రేటు.. అది సివిల్ పంచాయితీ అయితే మరో రేటు ఫిక్స్ చేస్తూ దళారులు, మధ్యవర్తులతో ఉమ్మడి జిల్లా పోలీసు శాఖలోని కొందరు ఖాకీలు వసూళ్లకు ఎగబ డుతున్నారు. ఇటీవల కొందరు పోలీసులు ఏసీబీకి చిక్కడం, మరికొందరు సస్పెన్షన్‌కు గురికావడమే ఇందుకు నిదర్శనం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో క్రికెట్ బెట్టింగ్ విషయంలో మధ్యవర్తితో ఒక పోలీసు అధికారి అవినీతికి పాల్పడి డబ్బు లు వసూళ్లు చేసినట్లు రుజువు కావడంతో ఏసీబీ అధికారు లు అతన్ని రిమాండ్‌కు పంపారు. మరో ముగ్గురు పోలీసు అధికారులపై అవినీతిఆరోపణలు రావడంతో వారిపై నిఘా పెట్టడంతో పాటు ముమ్మరంగా విచారణ జరిపిన ఘటన ఉమ్మడి జిల్లా పోలీసు శాఖలో కలకలం రేపింది. కామారె డ్డిలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న రెండు గ్రూపులను ప ట్టణ పోలీసులు పట్టుకొని చిన్నచితకా కేసులు నమోదు చేశారు. అయితే స్టేషన్ బెయిల్ కోసం బెట్టింగ్ నిర్వాహకుల నుంచి డబ్బుల వసూళ్లకు కొందరు పోలీసు అధికారులు ఓ ప్రైవేట్ వ్యక్తిని మధ్యవర్తిగా నియమించుకుని అతని ద్వారా రూ.5లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి జిల్లా పోలీసు స్టేషన్‌లలో షరా మూముళ్లుగా మా రుతున్నాయి. కొన్ని పోలీసు స్టేషన్‌ల పరిధిలోని కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతీ కేసు విషయంలోనూ దళారులు, మధ్యవర్తులను నియమించుకుని ఇరువర్గాల నుంచి డబ్బులు వసూళు చేస్తున్నారని బహిరంగా విమర్శలే ఉన్నాయి. ఆ శాఖ జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకే ఆయా స్టేషన్‌లోని కొందరు పోలీసు అధికారులు క్రమశిక్షణ తప్పి అవినీతికి పాల్పడుతు న్నారనే వాదన వినిపిస్తోంది.
గతంలో డ్రైవర్‌లు, గన్‌మెన్‌లే మధ్యవర్తులు
గతంలో కొందరు పోలీసు అధికారులు మామూళ్ల వసూ ళ్లకు ఆయా పోలీసు స్టేషన్‌లో పనిచేసే డ్రైవర్లు, గన్‌మెన్‌ల నే మధ్యవర్తులుగా ఉపయోగించుకునే వారని తెలిసింది. వారి ద్వారానే పోలీసు స్టేషన్‌కు వచ్చే కేసులను సెటిల్‌మె ంట్ చేసి డబ్బులు వసూలు చేసేవారనే సమాచారం. అయి తే డబ్బుల పంపకాల విషయంలో తేడాలు రావడంతో డ్రై వర్‌లు, గన్‌మెన్‌లే పోలీసు అధికారులపై ఉన్నతాధికారుల కు ఫిర్యాదుచేసిన సంఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా అవినీతి నిరోధక శాఖకు పట్టించిన ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. దీంతో ఆయా పోలీసు స్టేషన్‌లోని కొందరు ఎస్‌ఐలు, సీఐలు, డివిజన్ స్థాయి అఽధికారులు వారి వద్ద ప నిచేసే డ్రైవర్లు, గన్‌మెన్లను ఇటీవలి కాలంలో డబ్బుల వ సూళ్ల విషయంలో ఇన్‌వాల్వ్ చేయడం లేదని తెలుస్తోంది. దీంతో ప్రైవేటు వ్యక్తులను మధ్యవర్తులుగా ఏర్పాటు చేసు కుని కేసుల విషయంలో, సివిల్ తగదాల్లో వారి ద్వారా వ సూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఏసీబీకి చిక్కిన ఒకే బ్యాచ్‌కు చెందిన సీఐలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పోలీసు శాఖపై అవినీ తి నిరోధక శాఖ గత కొన్నిరోజులుగా నిఘా పెట్టింది. రెం డు జిల్లాల్లోని పోలీసు శాఖలో అధికారులు, సిబ్బంది అవి నీతి, అక్రమాలకు పాల్పడుతూ ప్రతీ కేసు విషయంలోనూ ఇరువర్గాల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తు న్నారని ఆరోపణలు రావడంతో ఏసీబీ నిఘాను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే రెండు నెలల వ్యవధిలోనే ఉ మ్మడి జిల్లాలో ముగ్గురు సీఐలను పట్టుకుంది. నెలన్నర క్రి తం బాన్సువాడ రూరల్ సీఐ టాటాబాబు తన ఇంట్లోనే కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధి కారులు దాడులు చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇది జరిగిన పక్షం రోజులకే బోదన్ పట్టణ సీఐ పల్లె రాకేష్ గౌడ్ పోలీస్ స్టేషన్‌లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి నగదు, విలువైన సెల్‌ఫోన్ తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఐదు రో జుల క్రితం కామారెడ్డిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల నుం చి డబ్బులు వసూళ్లు చేశాడన్న ఆరోపణలపై పట్టణ సీఐ ఇందూర్ జగదీష్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాం డ్‌కు తరలించారు. అయితే, ఈ ముగ్గురు సీఐలు కూడా 2007 బ్యాచ్‌కు చెందినవారిగా తెలిసింది. ఒకే బ్యాచ్‌లో శిక్ష ణ పొందిన వీరు గత ఏడాది క్రితం ఎస్‌ఐల నుంచి సీఐలు గా పదోన్నతి పొందారు. ఈ బ్యాచ్‌కు చెందిన వారు ఎస్‌ఐ లుగా ఉన్న సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేపడు తూ ఆదర్శంగా నిలిచారు. కానీ ఈ ముగ్గురు సీఐలు మా త్రం పైన సేవా కార్యక్రమాలు చేస్తూనే లోపల అవినీతి అ క్రమాలకు పాల్పడుతున్నారు. సేవా కార్యక్రమాల ముసుగు లో ఈ ముగ్గురు ఇంకెన్ని వసూళ్లు చేశారోనని పోలీసు శాఖ లో చర్చ సాగుతోంది. ఈ బ్యాచ్‌కు చెందిన పోలీసు అధికా రుల మాదిరిగానే మరో బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఐలు సైతం సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ బ్యాచ్‌లోని కొంద రు ఎస్‌ఐలపై గతంలో ఏసీబీ అధికారులు నిఘా పెట్టినప్ప టికీ తప్పించుకున్నారని సొంతశాఖలోని కొందరు పోలీసు అధికారులు చెప్పుకురావడం గమనార్హం.