ప్రతీ దుకాణంలో ధరల పట్టికలను అందుబాటులో ఉంచాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2020-04-21T09:19:21+05:30 IST
ధరల పట్టికలను ప్రతీ దుకాణంలో అందు బాటులో ఉంచాలని కలెక్టర్ శరత్ అన్నారు.

కామారెడ్డి, ఏప్రిల్20: ధరల పట్టికలను ప్రతీ దుకాణంలో అందు బాటులో ఉంచాలని కలెక్టర్ శరత్ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టర్ చాంబర్‌లో వ్యాపారస్తులు, మెడికల్ అసోసియేషన్ ప్రతినిధుల తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు కూరగాయల విక్రయా లను మార్కెట్లో రైతులు విక్రయించుకోవచ్చని సూచించారు.
పండ్లు, కూరగాయల విక్రయాలను మార్కెట్లో రైతులు విక్రయించుకోవచ్చని తెలిపారు. కిరణా వ్యాపారులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెం డు గంటల తర్వాత షాపులన్నీ మూసివేయాలన్నారు. ఇతర జిల్లాల ధరలను తెలుసుకొని వాటి కన్నా తక్కువ ధరకు నిత్యావసర వస్తువుల ధరలను నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. పెసరపప్పు కిలో ధర రూ. 128, రవ్వ కిలో రూ.39, మంచినూనె లీటర్ ధర రూ.105 నిర్ణయించి నట్లు చెప్పారు. మెడికల్ షాపులు ఉదయం 6 గంటల నుంచి సా యంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచాలని సూచించారు.
మందులు అవసరం ఉంటే మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకన్న సెల్ నెంబర్ 98497447047, 7396807585లను సంప్రదించాలని సూచిం చారు. సమావేశంలో జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఎస్పీ లక్ష్మీనారాయణ, వ్యాపారులు మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.