కొండెక్కిన కూరగాయల ధరలు
ABN , First Publish Date - 2020-03-24T08:47:49+05:30 IST
జిల్లాలో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. నిన్న, మొన్నటి వరకు కూరగాయల ధరలు తక్కువకే

కామారెడ్డి, మార్చి23: జిల్లాలో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. నిన్న, మొన్నటి వరకు కూరగాయల ధరలు తక్కువకే లభించగా సోమ వా రం కొండెక్కాయి. నిన్న మొన్నటి వరకు రూ.5 కిలో టమాట రూ.20 నుంచి రూ.30 వరకు ధర పలికింది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఈ నెల 31 వరకు లాక్ డౌన్ విధించింది. ఆదివారం ఇంటికే పరిమితమైన ప్రజలు సోమవారం సరుకుల కోసం మార్కెట్లోకి వచ్చారు.
దీంతో వ్యా పారులు ధరలను అమాంతం పెంచేశారు. జిల్లా కేం ద్రంలో ప్రజలకు అందుబాటులో నాలుగు చోట్ల కూరగాయల మార్కెట్లను అధికారులు ఏర్పాటు చేశా రు. వంకాయ కిలో రూ.40, బెండకాయ, బీరకాయ, అలుగడ్డ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి లాంటివి రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయించారు. కరోనా భయం ఒక వైపు ఉండగా మరోవైపు కూరగాయల ధరలు ప్రజలను బెంబేలెత్తిసున్నాయి.