మిడతలపై యుద్ధానికి సిద్ధం!

ABN , First Publish Date - 2020-06-23T11:10:59+05:30 IST

జిల్లాపై మిడతల దండు ప్రవేశిస్తే వాటిపై దాడి చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.

మిడతలపై యుద్ధానికి సిద్ధం!

నాగ్‌పూర్‌ వద్ద కేంద్రీకృతమైన దండు

జిల్లాలో ప్రవేశిస్తే నివారణకు ప్రణాళికలు

21 సరిహద్దు గ్రామాలుగా గుర్తింపు 

అప్రమత్తమైన రైతులు, అధికారులు

22,478 ఎకరాల్లో సాగుభూములు

ఐదు శాఖల అధికారులతో కమిటీల ఏర్పాటు

స్పేయర్‌లు, ఫైరింజన్‌లు, ట్రాక్టర్లను సిద్ధంగా ఉంచిన అధికారులు


కామారెడ్డి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): జిల్లాపై మిడతల దండు ప్రవేశిస్తే వాటిపై దాడి చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కేంద్రీకృతమైన మిడతల దండు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశించే అవకాశాలు ఉన్నందున వాటి నివారణకు జిల్లా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించా రు. రాష్ట్రంలో మిడతల దండు వస్తే ఆయా జిల్లాల అధికారులు అ ప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్రస్థాయి ఉన్న తాధికారులు ఆదేశించారు. దీంతో కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేతారెడ్డి సమక్షంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మి డతల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళికలు రూపొం దించారు. వ్యవసాయ, పోలీస్‌, ఉద్యానవన, అటవీ, అగ్ని మాపక శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి సరిహద్దు గ్రామాల్లో పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. జిల్లా సరిహద్దు ప్రాం తాలైన జుక్కల్‌, మద్నూర్‌ మండలాల్లోని 21 గ్రామాలను గుర్తించి స్థానిక అధికారులను, రైతులను అప్రమత్తం చేస్తున్నారు.


నాగ్‌పూర్‌ వద్ద కేంద్రీకృతం...

పచ్చని పంట పొలాలను, అటవీ చెట్లను పీల్చిపిప్పి చేసే మి డతల దండు ఇప్పటికే దేశంలోకి ప్రవేశించాయి. ఈ మిడతలు గుంపులు గుంపులుగా పంట పొలాలపై, పచ్చని చెట్లపై దాడిచేసి నాశనం చేస్తుంటాయి. ఇప్పటికే కొన్ని మిడతల దండు ప్రవేశిం చగా రాజస్థాన్‌, మహారాష్ట్రలో పంట పొలాలపై దాడిచేసి రైతు ల కు తీవ్ర నష్టాన్ని కల్గిస్తున్నాయి. అయితే పాకిస్థాన్‌ నుంచి రాజ స్థాన్‌లోకి మరో మిడతల దండు ప్రవేశించిందని, ప్రస్తుతం ఇవి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కేంద్రీకృతమై ఉండడంతో తెలం గాణ ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన కామారెడ్డి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ తదితర జిల్లాలో అధికా రులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో జిల్లాలోని ఉన్నతాధికారులు సైతం మిడతలు దాడి చేస్తే ఎ లాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళికలు రూపొందిస్తు న్నారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లా, మండలాలను, గ్రామాలను అధికారులు ఇది వరకే గుర్తించారు.


సిద్ధంగా ఉన్న యంత్రాంగం...

జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో మిడుతలు పంట పొలాలపైనే దాడిచేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో అన్న దాతలు సాగు చేస్తున్న పంటల వివరాలు సేకరించడంతో పాటు పొలాల వద్దకు వెళ్లడానికి ఉన్న రవాణా మార్గాలను గుర్తిస్తున్నా రు. 21 సరిహద్దు గ్రామాల్లో 22,478 ఎకరాల్లో సాగు భూములతో పాటు అటవీ విస్తీర్ణం ఉందని గుర్తించారు. ఈ ప్రాం తాల్లో ర హదారులు లేని చోట ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు చేయించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు పనుల్లో నిమ గ్నమయ్యారు. మిడతల దండు పంట పొలాలపై పచ్చని చెట్లపై దాడిచేస్తే స్ర్పేయర్‌లు, ఫైర్‌ ఇంజన్‌లు ట్రాక్లర్ల సహాయంతో స్రే్ౖప లతో వాటిని అంతమొదించేందుకు చర్యలు తీసు కుంటున్నారు. ఇ ప్పటికే ఈ ప్రాంతాల్లో నాలుగు  ఫైర్‌ ఇంజన్లను అందుబాటులో ఉంచారు. 373 లీటర్ల రసాయన ద్రావణాలను, 2789 స్ర్పేయ ర్‌లను స్థానికంగా అందుబాటులో ఉంచారు. మిడతలు ఎప్పుడు ప్రవేశించినా వాటిపై దాడిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు.


21 గ్రామాలపై దాడిచేసే అవకాశం...

నాగ్‌పూర్‌ నుంచి రాష్ట్రంలోని మిడతల దండు ప్రవేశించే అవకాశాలు ఉండడంతో జిల్లాలోని సరిహద్దు మండలాలు, గ్రామాల్లో అధికారులు, సి బ్బంది రైతులను అప్రమత్తం చేస్తున్నారు. జుక్కల్‌, మద్నూర్‌ మండలాల్లోని 21 సరిహద్దు గ్రామాలను గుర్తించారు. మద్నూర్‌ మండలంలో 16 గ్రామాలు అంతపూర్‌, చిన్నతడ్గు, పెద్దతడ్గు, తడిహిప్పర్గ, మహలాస్పూర్‌, టాక్లీ(బి), చిమ్నపూర్‌, సిర్పూర్‌, హసన్‌టాక్లీ, లింబూర్‌, పెద్దశక్కర్గా, చిన్నశక్కర్గా, సలాబత్‌పూర్‌, హండే కేలూర్‌, సోనాల్‌, గోజిగావ్‌, జుక్కల్‌ మండలం చండేగోన్‌, గుల్లాతండా, మైబీపూర్‌ తండా, కత్తల్‌వాడి, సోపూర్‌ ఉన్నాయి. ఈ గ్రామాల్లో అధికారులు పర్యటించేందుకు ప్ర త్యేక వాహనాన్ని సమకూర్చారు.మిడతలపై నిఘా పెట్టి స్థానిక రైతులను అప్రమత్తం చేస్తున్నారు.


ప్రణాళిక సిద్ధం

మిడతల దండు జిల్లాల్లో ప్రవేశిస్తే ఎదురుకునేందుకు అఽ దికార యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాకు ముప్పులేన ప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రెవెన్యూ, వ్యవ సాయ, అగ్నిమాపక, పోలీస్‌ ఉద్యానవనశాఖ సిబ్బందిని అప్ర మత్తం చేస్తూ ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ శాఖల అధికారులు, సిబ్బందితో జిల్లా స్థాయి కమిటీలతో పాటు సరి హద్దు గ్రామాల్లో కమిటీలను నియమిస్తున్నారు. ఈ ప్రాం తాల్లో రహదారులను నిర్మిస్తున్నారు. ఆయా శాఖల అధికా రులతో పాటు ప్రజా ప్రతినిధులను భాగస్వా ములను చేస్తూ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వీరికి సాంకేతిక, సహాయ సహకారాలు అందించేందుకు అధి కారులు సిద్ధ మవుతున్నారు.


మిడతల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం: చంద్రశేఖర్‌, ఇన్‌చార్జ్‌ జిల్లా వ్యవసాయాధికారి

జిల్లాలో మిడతలు ప్రవేశిస్తే వాటి నివారణకు ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నాం. ఇప్పటికే మిడతలు ప్రవేశించే జిల్లా సరి హద్దులోని 21 గ్రామాలను గుర్తించాం. అక్కడ ఆ గ్రామాల్లోని రైతులకు మిడతలపై అవగాహన కల్పిస్తూ అవి కనిపిస్తే ఎ లాంటి రసాయనాలు స్ర్పే చేయాలనే దానిపై అవగాహన క ల్పిస్తున్నాం. స్థానికంగా మిడతలను అంతమొదించేందుకు ఉపయోగించే రసాయనాలను, ఫైర్‌ ఇంజన్లను, స్ర్పేయర్‌లను అందుబాటులో ఉంచాం.ప్రస్తుతం మిడతలతో జిల్లాకు ము ప్పేమీలేదు. అయినప్పటికీ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. 

Read more