అకాల వర్షం..అన్నదాతకు నష్టం

ABN , First Publish Date - 2020-03-15T11:49:58+05:30 IST

మండలంలో శుక్ర వారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు అన్నదాతకు నష్టం జరిగింది. నోటికి వచ్చిన పంటలు తడిసి ముద్దవడంతో రైతులు ఆం దోళన చెందుతున్నారు. పసుపును

అకాల వర్షం..అన్నదాతకు నష్టం

నందిపేట, మార్చి14: మండలంలో శుక్ర వారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు అన్నదాతకు నష్టం జరిగింది. నోటికి వచ్చిన పంటలు తడిసి ముద్దవడంతో రైతులు ఆం దోళన చెందుతున్నారు. పసుపును ఉడికించిన రైతులు ప్లాట్‌ పారాలు లేకపోవడంతో నేలపై నే ఆరబెట్టారు. దీంతో వర్షం నీరు చేరి తడిసి పోయింది. పసుపు రంగు మారడంతో వ్యాపా రులు ఆ పసుపును కొనడానికి ముందుకురా రని రైతులు ఆవేదన వ్వక్తం చేస్తున్నారు. అ లాగే తెల్లజొన్న, ఎర్రజొన్న రాసులు తడిసిపో యాయి. టార్ఫాలిన్లు కప్పినప్పటికీ డొంకేశ్వర్‌, నికాల్‌పూర్‌, అన్నారం, సిర్పూర్‌, నడ్కుడ, గా దేపల్లి గ్రామాల్లో పడ్డ వడగళ్లకు జొన్న రాసు లు తడిసిపోయాయి. అలాగే నువ్వులు,  మొక్కజొన్న పంటలు నేలవాలాయి. ఈదు రుగాలులకు మామిడి కాయలు నేలరాలింది. తడిసిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని రైతులు డిమా ండ్‌ చేస్తున్నారు. 


రెంజల్‌లో..

రెంజల్‌: మండలంలోని కందకుర్తి, నీలా, పేపర్‌మిల్‌ గ్రామాలకు చెందిన రైతులు అకా ల వర్షం కురవడంతో రైతన్నకు నష్టం వాటిల్లి ంది. కందకుర్తి కొనుగోలు కేంద్రం వద్ద రాశు లుగా పోసిన శనగ శుక్రవారం రాత్రి 11గం టల సమయంలో అకాల వర్షం కురవడంతో అంత తడిసిముద్దయ్యింది. కొనుగోలు వద్ద సు మారు 5వేల బస్తాలకు పైగా శనగ వర్షానికి తడిసిపోయాయి.  గతంలో 8నుంచి10 క్విం టాల వరకు పంట పండేది. ప్రస్తుత వాతా వరణంలోని మార్పుతో దిగుబడి తక్కువగా వచ్చింది. కష్టంలో ఉన్న రైతన్నకు శుక్రవారం కురిసిన వర్షం మరింత కష్టాన్ని మిగిల్చింది. రాత్రి వరకు కొనుగోలు కేంద్రం వద్ద సుమారు రెండు వేల బస్తాల ను కాటా చేశారు. రెండు వేల బస్తాలు సైతం తడిసి ముద్దయ్యాయి.


ఒక కందకుర్తి కొన్ని వేలు వద్దనే సుమారు 5వేల బస్తాలకు పైగా వర్షానికి తడి సిపోయాయి. శుక్రవారం చిన్న రైతుల 5సంచులు 10సంచులు ఇలా 15క్విం టాల చొప్పున చిన్న రైతులు కాటా చేశారు. కా టా చేసిన బ్యాగులు సైతం శనగలను ఎండ బెట్టాలని అధికారులు సూచించడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. పండించిన పంటను శుభ్రం చేసి ఎండబెట్టి కొనుగోలు కేంద్రంలో కాటా చేయిస్తే కొన్ని గంటల్లోనే అది తడిసి ముద్దయ్యింది. మళ్లీ వాటిని ఎండబెట్టి మళ్లీ కొనుగోలు చేయించాలంటే తలకు మించిన భారమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో తంబాకు సైతం తడిసి మద్దయ్యింది. మరోక పక్కన వరి పం ట చేతికి వస్తున్న తరుణంలో ఇలా అకాల వర్షాలు కురవడంతో రైతులు ఆందోళన చెం దుతున్నారు. గత తొమ్మిది సంవత్సరాల క్రితం అకాల వర్షం కురిసి ఇక్కడి ప్రాంత రైతులు అపార నష్టాన్ని చవి చూశారు. 

Updated Date - 2020-03-15T11:49:58+05:30 IST