వృద్ధురాలి హత్య కేసును చేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2020-12-27T06:07:16+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి గ్రామానికి చెందిన ఎల్లవ్వ హత్య కేసును చేధించి, ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

వృద్ధురాలి హత్య కేసును చేదించిన పోలీసులు

ఇందల్వాయి, డిసెంబరు 26: నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి గ్రామానికి చెందిన ఎల్లవ్వ హత్య కేసును చేధించి, ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మండలం లోని తిర్మన్‌పల్లి గ్రామానికి చెందిన ఎల్లవ్వ ఈ నెల 11న మందుల కోసం అ దే గ్రామానికి చెందిన ఎల్లయ్య, నర్సవ్వ దంపతులు మాయమాటలు చెప్పి కోటగల్లిలోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లారు. ఎల్లవ్వ మెడలో ఉన్న బంగారు, వెండి నగల కోసం హత్య చేశారు. మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చి పెట్టారు. ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి విచారణ చేపట్టి నాలుగు రోజుల్లోనే హత్య కేసును చేధించారు. మొబైల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు సీఐ తెలిపా రు. వారిద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2020-12-27T06:07:16+05:30 IST