ప్రకృతివనంలో మొక్కలను దగ్గరగా నాటాలి

ABN , First Publish Date - 2020-12-20T04:49:07+05:30 IST

రాష్ట్ర ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రకృతివ నంలో మొక్కలను దగ్గరగా నాటాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు.

ప్రకృతివనంలో మొక్కలను దగ్గరగా నాటాలి
జంగంపల్లి గ్రామంలో మొక్కలను పరిశీలిస్తున్న కలెక్టర్‌

భిక్కనూరు, జంగంపల్లి, బస్వాపూర్‌లో కలెక్టర్‌ పర్యటన

భిక్కనూరు, డిసెంబరు 19: రాష్ట్ర ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రకృతివ నంలో మొక్కలను దగ్గరగా నాటాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. శనివారం మం డలంలోని భిక్కనూరు, జంగంపల్లి, బస్వాపూర్‌లో శ్మశానవాటిక, ప్రకృతివనా లు, స్త్రీశక్తి భవనం, పాఠశాల అదనపు గదులు, రైతు వేదికలను పరిశీలించా రు. ఈ మేరకు కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 23న మండలంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి పర్యటిస్తారని, రైతువేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అవెన్యూ ప్లాంటెషన్‌లో నాటిన మొక్కలు ఎండకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలోని బస్వాపూర్‌లో నూతనంగా నిర్మిం చిన సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. కారక్రమంలో డీఆర్‌డీవో చంద్రమోహన్‌, డీపీవో సాయన్న, ఎంపీడీవో అనంత్‌రవు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T04:49:07+05:30 IST