ఫిట్స్‌తో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-11-27T05:21:27+05:30 IST
భీమ్‌గల్ మండలంలోని సికింద్రాపూర్ గ్రామానికి చెందిన బండారి గంగాసాయిలు (38) కేజ్‌వీల్ ట్రాక ్టర్ నడుపుతుండగా ఫిట్స్ రావడంతో వ్యవసాయ భూమిలో పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడని ఎస్ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

భీమ్‌గల్, నవంబరు 26: భీమ్‌గల్ మండలంలోని సికింద్రాపూర్ గ్రామానికి చెందిన బండారి గంగాసాయిలు (38) కేజ్‌వీల్ ట్రాక ్టర్ నడుపుతుండగా ఫిట్స్ రావడంతో వ్యవసాయ భూమిలో పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడని ఎస్ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. గంగాసాయిలు కేజ్‌వీల్ ట్రాక్టర్‌తో భీమ్‌గల్ శివారులోని మూత పెద్దగంగారాంకు చెందిన వ్యవసాయ భూమి దున్నుతుండగా ఫిట్స్ రావడంతో బురదలో పడి చనిపోయాడన్నారు. ఆయన తమ్ముడు దిలీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.