జనతా కర్ఫ్యూకు జనం జేజేలు

ABN , First Publish Date - 2020-03-23T09:53:27+05:30 IST

ప్రపం చాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి చెంద కుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివారం జనతా కర్ఫ్యూకు...

జనతా కర్ఫ్యూకు జనం జేజేలు

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపునకు విశేష స్పందన 
  • రోడ్లన్నీ నిర్మానుష్యం 
  • బంద్‌కు సహకరించిన జిల్లా ప్రజలకు కలెక్టర్‌, ఎస్పీ కృతజ్ఞతలు

కామారెడ్డి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ప్రపం చాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి చెంద కుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చాయి. దీంతో జనం జేజేలు ప లికారు. కేంద్ర ప్రభుత్వం 16 గంటల బంద్‌కు పిలు పునిస్తే రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల బంద్‌కు పిలు పునిచ్చింది. కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భా గంగా దేశ వ్యాప్తంగా ఇచ్చిన బంద్‌ జిల్లాలోని ప్రజ లు గ్రామ, మండలం, పట్టణం అనే తేడా లేకుండా ప్రజలు జేజేలు పలుకుతూ కర్ఫ్యూకు సహకరించా రు. సాయంత్రం ఐదు గంటలకు కృతజ్ఞతగా చప్ప ట్లు కోట్టాలని పిలుపునివ్వడంతో జిల్లా ప్రజలు చప్ప ట్లతో కృతజ్ఞతలు తెలిపారు.


జిల్లా వ్యాప్తంగా బంద్‌ కు విశేష స్పందన లభించింది. జిల్లా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. సకలం బంద్‌ కావడంతో రోడ్ల న్నీ నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు జిల్లా కేం ద్రంతోపాటు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్ర త్యేక టీమ్‌లు పర్యవేక్షణ చేయడంతో బంద్‌కు జిల్లా ప్రజలు జేజేలు పలికారు. కరోనా వైరస్‌ను కట్టడి చే సేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇచ్చిన పిలుపునకు జిల్లా ప్రజలు సహకరించారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌లు కరోనాపై యు ద్ధం ముందస్తు చర్యల్లో భాగంగా పాఠశాలలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించారు. హాస్టళ్లు బంద్‌ చేయడంతోపాటు బార్లు, సినిమా హాళ్ల వంటి వాటిని సైతం మూసివేయాలని ఆదేశాలు సైతం జారీ చేయడంతో సినిమా హాళ్లు బంద్‌ పాటించా యి. ఈ క్రమంలో ఆదివారం దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునివ్వ గా.. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుం ది. ఆదివారం ఉదయం ఆరు నుంచి సోమవారం ఉ దయం ఆరు గంటల వరకు ఇంట్లోనే ఉండాలని సీ ఎం పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సులు సైతం ఆపివే శారు. స్పీకర్‌ పోచారం శీనివాస్‌రెడ్డి, ప్రభుత్వవిఫ్‌ గంపగోవర్ధన్‌, కలెక్టర్‌, ఎస్పీల ఆదేశాలతోపాటు ఆ యా రాజకీయ పార్టీ నాయకులు సైతం కరోనా వ్యా ప్తి చెందకుండా సహకరించారు. అప్రమత్తతే శ్రీ రా మ రక్ష అంటూ పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ వి జయవంతం చేసేలా వర్తక, వాణిజ్య, హోటళ్లు ఇత ర, అన్నిరకాల వ్యాపారుల్లో చైతన్యం తేవడంతో బం ద్‌ సక్సెస్‌ అయింది.


మున్సిపల్‌ కమిషనర్లు, సిబ్బంది ఆయా మున్సిపాలిటీల పరిధిలో వ్యాపారులతో స మావేశమై మెడికల్‌ షాపులు, అత్యవసరం మినహా ఇతర దుకాణాలు బంద్‌ చేసేలా ముందస్తూ చర్య లు చేపట్టారు. అదేవిధంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆదివారం చేపట్టిన జనతా కర్ఫ్యూను వి జయవంతం చేయాలని శనివారం చాటింపు వేయిం చారు. ఇదిలా ఉండగా.. జనతా కర్ఫ్యూ అమలుకు పోలీస్‌శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రతీ పో లీస్‌స్టేషన్‌ పరిధిలో ఉదయం 6:30 గంటలకు సైర న్‌ వేసుకుంటూ వాహనాలను తిప్పుతూ.. కరోనా ని వారణకు కష్టపడుతున్న వైద్యులు, శాస్త్రవేత్తలను చప్పట్లతో అభినందించేందుకు వీలుగా సాయంత్రం ఐదుగంటల సమయంలో మరోసారి సైరన్‌ వేసు కుంటూ తిరిగారు. దీంతో ప్రజలు చప్పట్లతో కృతజ్ఞ త భావాన్ని చాటారు.


జిల్లా ప్రజల స్వచ్ఛంద మద్దతు..

కరోనాపై విసృత్త అవగాహన కల్పించిన నేపథ్యం లో జిల్లా ప్రజలు సైతం జనతా కర్ఫ్యూ విజయ వంతం చేసే దిశగా ముందుకు సాగారు. కొన్ని చో ట్ల శనివారం రెండు రోజులకు సరిపడా సామగ్రిని కొనుగోలు చేసి.. ఇంటికి తీసుకెళ్లారు. కాగా నిత్యం జన రద్ధీతో కళకళలాడే ప్రభుత్వ కార్యాలయాలు క రోనా నేపథ్యంలో బోసిపోయాయి. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లో వాహ నాలు, జనం రద్దీతో కిక్కిరిసే బస్టాండ్లు, జంక్షన్లు, హోటళ్లలు మూసి ఉంచడంతో రద్దీ లేకుండా బోసి పోయాయి. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్లు విడిచి బయట కు రావొద్దు అని వైద్యులు, అధికారులు సూచించ డంతో జిల్లాలో ముందస్తూగానే కర్ఫ్యూ వాతావర ణం నెలకొంది. ఆదివారం జిల్లా వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ సక్సెస్‌ అయింది.


అధికారుల పకడ్బందీ నిఘా..

ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా పాజిటివ్‌ వస్తున్న నేపథ్యంలో జి ల్లాలో అధికారులు జల్లెడ పడుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికే కాక అనుమానిత కరోనా లక్ష ణాలతో నిత్యం రెండు నుంచి మూడు కేసులను హైదారాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులపై గట్టి నిఘా పెట్టారు. వి దేశాల నుంచి వచ్చిన వారి వివరాలను తమకు తె లపాలని సర్పంచ్‌, కార్యదర్శులకు సూచిస్తున్నారు. ఆదివారం భిక్కనూరు మండలం తిప్పాపూర్‌కు చెం దిన ఓ వ్యక్తి గల్ఫ్‌ నుంచి రావడంతో అతనికి తీవ్ర దగ్గు, జలుబు ఉండటంతో కామారెడ్డి ప్రభుత్వ ఆ సుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి  గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రత్యేక టీమ్‌లుగా ఏర్పడి వాకబ్‌ చేస్తున్నారు. కరోనా కట్టడి పై జిల్లా ప్రజలు జనతా కర్ఫ్యూకు సహకరిం చడం తో కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేతారెడ్డి, జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-03-23T09:53:27+05:30 IST