నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా
ABN , First Publish Date - 2020-04-21T09:20:01+05:30 IST
లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమిస్తున్న వారిపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. కామారెడ్డి జి ల్లా కేంద్రంలో

కామారెడ్డిటౌన్, ఏప్రిల్ 20: లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమిస్తున్న వారిపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. కామారెడ్డి జి ల్లా కేంద్రంలో సోమవారం ఆర్‌ఐ జానయ్య నేతృత్వంలో పలువురు దు కాణదారులకు జరిమానా విధించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ శైలజ ఆదేశాల మేరకు పట్టణంలో నిబంధనలు అతిక్రమిస్తూ మాస్క్‌లు లేకుండా తిరుగుతున్నా, వ్యాపార సముదాయల వద్ద భౌతికదూరం పాటించకపోయినా, మధ్యాహ్నం 2 గంటల తర్వాత దుకాణాలు తెరిచి ఉంచినా జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు. సోమవారం రూ.10 వేల వరకు జరిమానాలు విధించామని తెలిపారు. ప్రజలు, వ్యాపార, దుకాణదారులు నిబంధనలు పాటించి తమకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరి ఇన్‌స్పెక్టర్ దేవిదాస్, బిల్ కలెక్టర్‌లు తదితరులు పాల్గొన్నారు.