పట్టాపాసు పుస్తకాలు ఇవ్వాలని ధర్నా

ABN , First Publish Date - 2020-07-09T10:35:04+05:30 IST

రైతులకు పట్టాపాసు పుస్తకాలు ఇవ్వాలని కామారెడ్డి జిల్లా రామారెడ్డి తహసీల్దార్‌ కార్యాలయం..

పట్టాపాసు పుస్తకాలు ఇవ్వాలని ధర్నా

రామారెడ్డి, జూలై 8: రైతులకు పట్టాపాసు పుస్తకాలు ఇవ్వాలని కామారెడ్డి జిల్లా రామారెడ్డి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సీపీఐ, ఏఐకేఎస్‌ ఆధ్వ ర్యంలో బుధవారం రైతులు ధర్నా నిర్వహించారు. మండలంలోని సింగరాయ పల్లి గ్రామంలో గల పోడు భూములను సాగు చేసుకొనివ్వాలని, పట్టాపాసు పుస్తకాలు అందించాలని డిమాండ్‌ చేస్తూ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. అనంతరం కార్యాలయంలోని ఆర్‌ఐకి వినతి ప్రత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరత్‌ మాట్లాడు తూ సింగరాయపల్లి గ్రామానికి చెందిన నిరుపేద రైతులు పోడు భూముల ను గత 50ఏళ్లుగా సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు.


322 సర్వే నెంబర్‌లో 360 ఎకరాల భూమిలో 100 రైతు కుటుంబాలు సాగు చేస్తూ జీవిస్తున్నాయన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం, ఫారెస్టు అధికారులు పోడు భూములను సాగు చేయనీయకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఈ భూము ల్లో సాగు అనుమతి ఇచ్చ, పట్టా పాసు పుస్తకాలు ఇవ్వకుంటే సీపీఐ ఆధ్వర్య ంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాల్‌రాజు, రైతు సంఘం జిల్లా నాయకులు శ్యామల, ఖాసీం, రేణుక, నరేష్‌, లక్ష్మీ, రాజమణి, నారాయ ణ బాలమణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-09T10:35:04+05:30 IST