గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-12-06T05:10:41+05:30 IST

గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. శనివారం న్యాల్‌కల్‌, సిర్‌పూర్‌ గ్రామాల్లో అభివృద్ధి పనుల గురించి స్థానిక సర్పంచ్‌లను అడిగి తెలుసుకున్నారు.

గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : ఎమ్మెల్యే
మల్లారం రోడ్డును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి

మోపాల్‌, డిసెంబరు 5: గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. శనివారం న్యాల్‌కల్‌, సిర్‌పూర్‌ గ్రామాల్లో అభివృద్ధి పనుల గురించి స్థానిక సర్పంచ్‌లను అడిగి తెలుసుకున్నారు. న్యాల్‌కల్‌ నుంచి ముదక్‌పల్లి వరకు కొనసాగుతున్న బీటీరోడ్డు పనులను, సిర్‌పూర్‌, న్యాల్‌కల్‌  గ్రామాల్లో పార్కులను పరిశీలించారు. ధర్పల్లి జడ్పీటీసీ జగన్‌, స ర్పంచ్‌లు ముత్యంరెడ్డి, గంగాప్రసాద్‌, నాయకులు శ్రీనివాస్‌రావు, డి.కిషోర్‌రావు, సతీష్‌రెడ్డి, ఎంపీటీసీ ముత్యం ఉన్నారు. 

మల్లారం రోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలి

నిజామాబాద్‌ రూరల్‌ : ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో ఆలసత్వం ప్రదర్శించవద్దని, త్వరగా పూర్తిచేయాలని రూరల్‌ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్‌ ఆదేశించారు. శనివారం మల్లారం, ధర్మారం రోడ్డుల పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామీణ రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తుందని తెలిపారు. అధికారులు నాణ్యతతో కూడిన పనులు వేగంగా చేపట్టాలని సూచించారు. సంవత్సరాల తరబడి గుంతలమయంగా ఉన్న మల్లారం రోడ్డు నిర్మాణపనులకు రూ.39 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. మల్లారం, వైస్‌ ఎంపీపీ అన్నం సాయిలు, ఎంపీటీసీ శైలజ రవీందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అంశాల స్వామి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత

మల్కాపూర్‌ తండాకు చెందిన బిక్యాకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అందించారు. శనివారం ఆయన నివాసంలో రామావత్‌ వర్జీనాత్‌కు రూ.20వేల చెక్కును అందించారు. కార్యక్రమంలో ప్రకాష్‌ నాయక్‌, ప్రేమ్‌నాయక్‌, గోపాల్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

డిచ్‌పల్లి: ధర్మారం (బి)కి చెందిన పోతారాజుకు రూ.60వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ జగన్‌ మోహ న్‌, డిచ్‌పల్లి జడ్పీటీసీ ఇందిరా, విండో చైౖర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ముబారక్‌ నగర్‌ కార్పొరేటర్‌ యమున పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:10:41+05:30 IST