పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

ABN , First Publish Date - 2020-06-26T11:18:34+05:30 IST

గ్రామాలలో పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యం తది తర అంశాల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత సూచించారు

పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత


నవీపేట, జూన్‌ 25: గ్రామాలలో పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యం తది తర అంశాల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత సూచించారు. గురువారం నవీపేట మండలంలోని అభంగపట్నం, మోకన్‌ పల్లి, కమలాపూర్‌, నాడాపూర్‌, నవీపేటలలో ఆమె ఆకస్మికంగా పర్యటిం చారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో చేపడుతున్న వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్‌, డంపింగ్‌యార్డు పనులను ఆమె పరిశీలించారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని గ్రామాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంతోపాటు ప్రతి గ్రామంలో కనీసం ఒక ఎకరం విస్తీర్ణం లో పార్కులు ఏర్పాటుచేసి అందులో వివిధ రకాల పండ్ల మొక్కలను నా టాలని కోరారు. ఈ నెలాఖరు లోగా అన్ని గ్రామాలలో వైకంఠధామాలు, కంపోస్టు షెడ్‌, డంపింగ్‌యార్డుల నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.


లేకపోతే ఆయా గ్రామాల సర్పంచ్‌లతోపాటు సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. గ్రామాలలో పా రిశుద్ద్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సీజనల్‌ వ్యాదులు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంద ర్భంగా నవీపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలు నాటా రు. కార్యక్రమంలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్‌, సర్పంచ్‌లు ఏటీఎస్‌ శ్రీనివా స్‌, సుధాకర్‌, లత, రమ, సూరవ్వ, ఎంపీడీవో సయ్యద్‌సాజిద్‌అలీ, మండ ల ప్రత్యేక అధికారి రమేష్‌, ఎపీవో రాజేశ్వర్‌, ఎంపీవో రాజ్‌కాంత్‌రావు తది తరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-26T11:18:34+05:30 IST