నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2020-12-01T05:42:06+05:30 IST
వచ్చే విద్యాసంవత్సరం నాటికి నవోదయ పాఠశాల లో 6వ తరగతిలో ప్రవేశం కోసం డిసెంబరు 15వ తేదీ వరకు దరఖాస్తులు చే సుకోవాలని ఎంఈవో డి.స్వామి తెలిపారు.
భీమ్‌గల్, నవంబరు30: వచ్చే విద్యాసంవత్సరం నాటికి నవోదయ పాఠశాల లో 6వ తరగతిలో ప్రవేశం కోసం డిసెంబరు 15వ తేదీ వరకు దరఖాస్తులు చే సుకోవాలని ఎంఈవో డి.స్వామి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక పత్రికా ప్రకటన చేశారు. 2021-22 సంవత్సరానికి గాను నవోదయలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన పరీక్షలు నిర్వహించనున్నామని అన్నారు. ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.