కొనసాగుతున్న నీటి విడుదల

ABN , First Publish Date - 2020-07-22T11:02:26+05:30 IST

శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటల కో సం విడుదల చేసిన నీటి విడుదల ప్రధానకాలువలు కాకతీయ, లక్ష్మీకాలువ లకు కొనసాగుతోందని

కొనసాగుతున్న నీటి విడుదల

మెండోర, జూలై 21: శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటల కో సం విడుదల చేసిన నీటి విడుదల ప్రధానకాలువలు కాకతీయ, లక్ష్మీకాలువ లకు కొనసాగుతోందని ప్రాజెక్టు డీఈ జగదీష్‌ తెలిపారు. ప్రాజెక్టు నుంచి కా కతీయ కాలువకు 4వేల క్యూసెక్కులు, లక్ష్మీకాలువకు 100క్యూసెక్కులు, అలీ సాగర్‌, గుత్పకు 900 క్యూసెక్కుల నీరు విడుదలవుతోందన్నారు.


ప్రాజెక్టు నుంచి ఆవిరి రూపంలో 412క్యూసెక్కులు, మిషన్‌ భగీరథ తాగునీటి కోసం కోరుట్ల, జగిత్యాలకు 55 క్యూసెక్కులు, ఆదిలాబాద్‌, నిర్మల్‌కు 32 క్యూసెక్కు లు, నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌ పట్టణాలకు 57 క్యూసెక్కుల నీటి వి డుదల జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమ ట్టం 1091అడుగులు (90టీఎంసీలు) కాగా, మంగళవారం సాయంత్రానికి 1073.6 అడుగుల(36.528టీఎంసీలు) నీటి నిల్వ ఉందన్నారు. గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టులో 1048.30 అడుగుల(5.306టీఎంసీలు) నీటి నిల్వ ఉం దని ఆయన వివరించారు. 

Updated Date - 2020-07-22T11:02:26+05:30 IST