కొనసాగుతున్న ఉర్సు
ABN , First Publish Date - 2020-03-08T11:35:43+05:30 IST
వర్ని మండలం బడా పహాడ్(పెద్దగుట్ట) పుణ్యక్షేత్రం ఉర్సు ఉత్స వాలు రెండో రోజు శనివారం కొనసాగాయి. ఉత్సవాలను

వసతుల కల్పనలో వక్ఫ్‌బోర్డు సిబ్బంది నిర్లక్ష్యం
వర్ని, మార్చి 7: వర్ని మండలం బడా పహాడ్(పెద్దగుట్ట) పుణ్యక్షేత్రం ఉర్సు ఉత్స వాలు రెండో రోజు శనివారం కొనసాగాయి. ఉత్సవాలను తిలకించేందుకు తెలుగురా ష్ర్టాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టా ల నుంచి భక్తులు తరలివచ్చారు. బడాప హాడ్‌లోని అజ్రాత్ సయ్యద్ షాదుల్లాహు స్సేని బాబా దర్గ వద్ద భక్తులు ప్రత్యేక పూ జలు చేశారు. గుర్రపు బొమ్మకు నాణాలు సమర్పించారు. రామన్న లొంక ఆలయం లో కులమతాలకతీతంగా హిందూ ముస్లి ంలు పూజలు చేశారు.
ఉత్సవాల నిర్వాహణ కోసం రాష్ట్ర వక్ఫ్‌బో ర్డు రూ. 12.50లక్షలు కేటాయించినప్పటికీ వాటిని సద్వినియోగం పరచడంలో వక్ఫ్ బోర్డు సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈఉత్సవాల నిధులను దుర్వినియోగం చేశారన్న రీతిలో వసతులు స్పష్టంగా కనిపించాయి. ఎక్కడ భక్తులకు అవసరమైన వసతులు కల్పించకపోగ పారిశుధ్యం కారణంగా పరిసరాలు దుర్గంధమయ్యాయి. జిల్లా అదనపు కలెక్ట ర్ చంద్రశేఖర్ ఉత్సవాల నిర్వహణకు పక డ్బందీ చర్యలు చేపట్టినప్పటికీ ఆయన ఆదే శాలను వక్ఫ్‌బోర్డు సిబ్బంది బేఖాతరు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవు తున్నాయి. తాము చెప్పిందే వేదమం టూ వక్ఫ్‌బోర్డు సిబ్బంది కార్యకలాపాలు కొనసా గించడం అవినీతి అక్రమాలకు తావిస్తోంది. బడాపహాడ్‌లో చోటుచేసుకున్న అవినీ తిపై కలెక్టర్ సత్వర చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.