మమత హత్య కేసుపై కొనసాగుతున్న విచారణ

ABN , First Publish Date - 2020-12-12T04:57:43+05:30 IST

పుర్రె మమత హత్య కేసుపై సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు రెండో రోజు బహిరంగా విచారణ చేశారు.

మమత హత్య కేసుపై కొనసాగుతున్న విచారణ

సిరికొండ, డిసెంబరు 11 : పుర్రె మమత హత్య కేసుపై సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు రెండో రోజు బహిరంగా విచారణ చేశారు. దోషులను పట్టుకోవడానికి ఏర్పడ్డ ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు అదనపు డీసీపీ ఉషావిశ్వనాథ్‌, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌,దర్పల్లి సీఐ ప్రసాద్‌ శుక్రవారం ఉదయం నుంచి పాఠశాల ఆవరణలో బహిరంగా విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన ఆరుగురు తమకు తెలిసిన విషయాలను వివరించారు. తాము రికార్డు చేసినట్లు దర్పల్లి సీఐ ప్రసాద్‌ తెలిపారు.


Updated Date - 2020-12-12T04:57:43+05:30 IST