కొనసాగుతున్న హోం ఐసోలేషన్‌ ప్రక్రియ

ABN , First Publish Date - 2020-03-24T08:43:53+05:30 IST

కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ ప్రభావం ఒక్కరి నుంచి మరొకరికి సంక్రమించకుండా వైద్యఆరోగ్యశాఖ

కొనసాగుతున్న హోం ఐసోలేషన్‌ ప్రక్రియ

కామారెడ్డిటౌన్‌, మార్చి 23: కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ ప్రభావం ఒక్కరి నుంచి మరొకరికి సంక్రమించకుండా వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న హోం ఐసోలేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగు తోంది. ఈ సందర్భంగా మెడికల్‌ ఆఫీసర్‌ సుజాయత్‌ అలీ మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంతో పాటు వారిని ఇంట్లో నుంచి దాదాపు 28 రోజుల వరకు బయటకు రాకుండా ఉండాలని సూచిస్తు న్నామన్నారు.


ఎప్పటికప్పుడు వారిని అబ్జర్వేషన్‌లో ఉంచాలని ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నామని తెలిపారు. కాగా కామా రెడ్డి జిల్లాలోని రాజంపేట్‌, రామారెడ్డి, కామారెడ్డి మండలానికి చెందిన ము గ్గురు వ్యక్తులు తీవ్ర జలుబు, దగ్గు ఉండడంతో అనుమానిత కరోనా లక్షణా లుగా భావించి కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక పరీక్షలు నిర్వహించి హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి పంపినట్లు సమా చారం. ఈ ముగ్గురు వ్యక్తులు గల్ఫ్‌ దేశాల నుంచి రావడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పరీక్షలకు పంపినట్లు సమాచారం.

Updated Date - 2020-03-24T08:43:53+05:30 IST