ఒకరి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-11-26T06:03:52+05:30 IST

ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటనా రామారెడ్డి మండలకేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది.

ఒకరి ఆత్మహత్య
నవీన్‌ మృతదేహం

రామారెడ్డి, నవంబరు 25: ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటనా రామారెడ్డి మండలకేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం మండలకేంద్రానికి చెందిన దండబోయిన నవీన్‌ (28) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో తాగుడికి బానిసయ్యాడు. ప్రతిరోజు తాగి వచ్చి భార్యతో గొడవపడడం జ రిగేది. చనిపోతా అని బెదిరించేవాడు. ఆవేశంలో ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకొని చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసున్నట్లు తెలిపారు. తలుపులు తీసి చూసే సరికి మృ తిచెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2020-11-26T06:03:52+05:30 IST