రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ABN , First Publish Date - 2020-12-16T05:13:16+05:30 IST
మండల కేంద్రం లోని జాతీయ రహదారి పై మద్నూర్ నుంచి వస్తున్న వాహనం ఢీ కొని ద్విచక్ర వాహన దా రుడు రహీం షా (63) మృతిచెందినట్లు ఎస్సై రాఘవేందర్ తెలిపారు.

మద్నూర్, డిసెంబరు 15 : మండల కేంద్రం లోని జాతీయ రహదారి పై మద్నూర్ నుంచి వస్తున్న వాహనం ఢీ కొని ద్విచక్ర వాహన దా రుడు రహీం షా (63) మృతిచెందినట్లు ఎస్సై రాఘవేందర్ తెలిపారు. మహా రాష్ట్రలోని దెగ్లూర్ గ్రామానికి చెందిన ర హీం షా బిచ్కుంద నుం చి మద్నూర్ వైపు టీవీ ఎస్ ఛాంప్‌పై వస్తుండ గా, మండల కేంద్రం లోని సబ్ స్టేష న్ వద్ద ఎదురుగా వస్తున్న బోలెరో వాహనం ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. శవ పంచనామా కోసం ప్రభుత్వ ఆస్పత్రికి శవాన్ని తరలించినట్లు పేర్కొన్నారు.