రైతుల ఢిల్లీ పోరాటానికి మద్దతుగా ఒక్క రోజు దీక్ష

ABN , First Publish Date - 2020-12-28T04:20:48+05:30 IST

: ఢిల్లీలో రైతు నిర్వహిస్తున్న పోరాటానికి మద్దతుగా ఆదివారం బోధన్‌లో ఒక రోజు దీక్ష కార్యక్రమం నిర్వ హించారు.

రైతుల ఢిల్లీ పోరాటానికి మద్దతుగా ఒక్క రోజు దీక్ష
బోధన్‌లో దీక్ష నిర్వహిస్తున్న నాయకులు

బోధన్‌, డిసెంబరు 27 : ఢిల్లీలో రైతు నిర్వహిస్తున్న పోరాటానికి మద్దతుగా ఆదివారం బోధన్‌లో ఒక రోజు దీక్ష కార్యక్రమం నిర్వ హించారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్‌చౌరస్తాలో దీక్ష శిబి రం ఏర్పాటుచేశారు. 30 రోజులుగా ఢిల్లీలో లక్షలాది మంది రైతులు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నా, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా కేంద్రం స్పందించకపోవడం బాధాకరమ న్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చట్టాలతో రైతులను మోసం చేస్తుందన్నారు. ఈ ఉద్యమంలో ఇప్పటి వరకు 33 మంది రై తులు ప్రాణాలు కోల్పోయిన బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేద న్నారు. పెట్టుబడిదారులకు కేంద్రం అనుకూలంగా వ్యవహరిస్తూ రైతు లను మోసం చేస్తుందన్నారు. రైతాంగ వ్యతిరేక చట్టాలను ఉపసం హరించుకోకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చ రించారు. సాయంత్రం దీక్షను విరమించారు. ఈ నిరసన కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్‌బాబు, న్యాయవాది హన్మంత్‌రావు, సీఐటీయూ నాయకులు కుమారస్వామి, శంకర్‌గౌడ్‌, యేశాల గంగాధర్‌, షేక్‌నజీర్‌, షేక్‌మీరా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T04:20:48+05:30 IST