పురుగుల మందు తాగి ఒకరి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-30T05:16:58+05:30 IST
మండలంలోని సిద్దాపూర్ గ్రామానికి చెందిన బలభీం (33) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై దత్తాత్రేయ గౌడ్ తెలి పారు.
జుక్కల్, డిసెంబరు 29: మండలంలోని సిద్దాపూర్ గ్రామానికి చెందిన బలభీం (33) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై దత్తాత్రేయ గౌడ్ తెలి పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దాపూర్ గ్రామానికి చెందిన బలభీం తన పంట పొలంలో ఉదయం పురుగుల మందు తాగడంతో చుట్టు పక్కల వారు గమనించి అతడిని బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. బాన్సు వాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.