మంత్రి ప్రశాంత్‌రెడ్డి చొరవతో

ABN , First Publish Date - 2020-07-18T10:46:11+05:30 IST

వానాకాలంలో పంటల సాగుకు ఎరువుల కొరత లేకుండా మంత్రి వేముల ప్రశాం త్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

మంత్రి ప్రశాంత్‌రెడ్డి చొరవతో

జిల్లాకు 2400 మెట్రిక్‌ టన్నుల యూరియా


నిజామాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వానాకాలంలో పంటల సాగుకు ఎరువుల కొరత లేకుండా మంత్రి వేముల ప్రశాం త్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సీఎం కేసీఆర్‌ , వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని జిల్లాలో పంటల సాగుకు అనుగుణంగా యూరి యా అందుబాటులో ఉంచాలని కోరారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు 2400 మెట్రిక్‌ టన్నుల యూరియా శుక్రవా రం వచ్చింది. మహబూబ్‌నగర్‌ నుంచి 500 మెట్రిక్‌ టన్నులు, సం గా రెడ్డి నుంచి వెయ్యి మెట్రిక్‌ టన్నులు, కరీనంగర్‌ నుంచి 500 మెట్రిక్‌ ట న్నులు, జడ్చర్ల నుంచి 400 మెట్రిక్‌ టన్నుల యూరియా జిల్లాకు చేరు కుంది. అడిగిన వెంటనే యూరియా పంపించిన సీఎం, వ్యవసాయ శాఖ మంత్రికి రైతుల పక్షాన మంత్రి వేముల ధన్యవాదాలు తెలిపారు. 

Updated Date - 2020-07-18T10:46:11+05:30 IST