దేవాదాయ భూములపై అధికారుల దృష్టి

ABN , First Publish Date - 2020-12-15T05:30:00+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో దేవాలయ ఆస్తులు అన్యాక్రాం తం అవుతుండడంతో యంత్రాంగం దృష్టిపెట్టింది. భూప్రక్షాళన ద్వారా భూముల లెక్కలు తేల్చిన అధికారులు వివరాలను పక్కా చేశారు.

దేవాదాయ భూములపై అధికారుల దృష్టి

ఉమ్మడి జిల్లాలో పహానీల ద్వారా లెక్కలు తేలుస్తున్న దేవాదాయ శాఖ అధికారులు 

త్వరలో దేవుళ్ల పేరు మీదనే పట్టాలు

నిజామాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో దేవాలయ ఆస్తులు అన్యాక్రాం తం అవుతుండడంతో యంత్రాంగం దృష్టిపెట్టింది. భూప్రక్షాళన ద్వారా భూముల లెక్కలు తేల్చిన అధికారులు వివరాలను పక్కా చేశారు. భూముల లెక్కలన్నింటినీ ధరణిలో ఎంట్రీ చేశారు. దేవాలయాల ఆధారంగా పహానీలను సరిచూస్తున్నారు. గ్రామాల వారీగా ఆయా దేవాలయ భూములను సరిచూస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలో దేవాదాయ, రెవెన్యూ, సర్వే ల్యాండ్‌ రికార్డ్‌ అధికారులు ఈ భూముల వివరాల లెక్కలను తేల్చడంతో పట్టాలు జారీచేసేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి పహానీలను సరిచూసిన తర్వాత కలెక్టర్‌ల ఆధ్వర్యంలో ఈ పట్టాలను దేవాదాయ శాఖ అధికారులకు అందజేయనున్నారు. 

ఉమ్మడి జిల్లాలో 1,358 దేవాలయాలు

ఉమ్మడి జిల్లా పరిధిలో 1358 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో 751 దేవాలయాలు నిజామాబాద్‌ జిల్లాలో ఉండగా.. 607 దేవాలయాలు కామారెడ్డి జిల్లాలో ఉన్నాయి. ఈ దేవాలయాల పరిధిలో కొన్నింటికి మాత్రమే దాతలు ఇచ్చిన భూములున్నాయి. నిజామాబాద్‌ జిల్లా పరిధిలో మొత్తం 215 దేవాలయాల పరిధిలో 2,029 ఎకరాల భూమి ఉంది. దీనిలో మెట్ట 780 ఎకరాలు ఉండగా.. మాగాణి 1,243 ఎకరాలు ఉంది. కామారెడి ్డజిల్లా పరిధిలో 156 దేవాలయాల పరిఽధిలో 1,887 ఎకరాలు ఉండగా మాగాణి 1,731 ఎకరాలు ఉంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ దేవాలయాల పరిధిలో ఉన్న భూములు కోట్ల రూపాయల విలువైనవి. రెండు పంటలు పండే భూములే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని వందల ఏళ్ల నుంచి ఉన్న దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలకు గతంలో దాతలు ఈ భూములను ఈనామ్‌గా ఇచ్చారు. దేవాలయాల పూజా కార్యక్రమాల నిర్వహణ కోసం ఈ భూములపైన వచ్చే ఆదాయం ద్వారా నిర్వహించేవారు. కాలక్రమేణ గత కొన్నేళ్లుగా ఉమ్మడి జిల్లా పరిఽధిలోనే విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇచ్చిన దాతల వారసులతో పాటు గత కొన్నేళ్లుగా కౌలు చేసిన వారు కూడా వాటిని ఆక్రమించారు. కొన్ని భూములు ఇతరుల చేతిలోకి వెళ్లాయి. దేవాదాయ శాఖాధికారులు కొన్ని భూములపైన కోర్టులలో కేసులను కూడా వేశారు. పట్టణాలతోపాటు మండల కేంద్రాలకు దగ్గరగా ఉన్న భూములు  ఎక్కువగా ఆక్రమణకు గురయ్యాయి. భూప్రక్షాళణ చేపట్టడంతో పాటు అన్ని శాఖల భూములను గుర్తించడంతో పాటు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో దేవాదాయ శాఖ భూములకు కూడా లెక్కలు తేల్చారు. అఽధికారులు ధరణిలో ఎంట్రి చేశారు. ఉమ్మడి జిల్లా పరిఽధిలోని ఈ దేవాలయ భూములను గత కొన్ని రోజులుగా రికార్డులను పరిశీలిస్తున్నారు. దేవాదాయ శాఖ అధికారులు భూములకు సంబంధించిన పహానీలను తీయడంతో పాటు ధరణిలో ఎంట్రీ అయిన వివరాలను పరిశీలిస్తున్నారు. ఏవైనా ఎక్కువ తక్కువలు, విస్తీర్ణంలో తేడాలు ఉంటే సంబంధిత మండల తహసీల్దార్‌లతో చర్చిస్తున్నారు. వారి ద్వారా వివరాలను సరిచేస్తున్నారు. ఈనెలాఖరులోపు పహానీల ఆధారంగా ధరణి వివరాలను సరిచేసి పట్టా లు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ దేవాలయం పరిఽధిలో ఉన్న భూములను ఆ దేవుళ్ల పేరు మీదనే ధరణిలో ఎంట్రీ చేశారు. పట్టాలు కూడా త్వరలో కలెక్టర్‌ల ఆధ్వర్యంలో జారీచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న భూములను మినహాయించి ఇతర భూములకు పట్టాలు ఇవ్వనున్నారు. ఈ భూమి మళ్లీ అన్యాక్రాంతం కాకుండా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. విలువైన భూములను కాపాడడంతో పాటు దేవాదాయ ఆదాయం పెంచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయంకు అనుకూలమైన భూములను వేలం ద్వారా రైతులకు ప్రస్తుతం కౌలు కు ఇస్తున్నారు. మిగతా భూములు బీడుగా ఉండడంతో వాటిలో ప్లాంటేషన్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జి ల్లా పరిఽధిలో దేవాదాయ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో భూముల వివరాలను పరిశీలిస్తున్నామని దేవాదాయ శాఖ సహా య కమిషనర్‌ సోమయ్య తెలిపారు.

Read more