అధికారి వర్సెస్ సిబ్బంది!
ABN , First Publish Date - 2020-06-25T11:14:02+05:30 IST
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అధికారికి సిబ్బందికి మధ్య వైరం కొనసాగుతోంది

విద్యాశాఖలో ముదురుతున్న వివాదం
టీఎన్జీవోస్ నాయకుల వద్దకు చేరిన పంచాయితీ
నిజామాబాద్ అర్బన్, జూన్ 24: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అధికారికి సిబ్బందికి మధ్య వైరం కొనసాగుతోంది.ఒక ఉన్నతాధికారిపై ఆ కార్యాలయంలో పని చేసే సిబ్బంది ఫిర్యాదు చేయడం జిల్లా ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జిల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యాశాఖ సూపరింటెండెంట్ స్థాయి నుంచి మొదలుకొని కింది స్థాయి వరకు పనిచేస్తున్న సి బ్బందికి వేధింపులు ఎక్కువ అవడంతో సిబ్బంది ఈ విషయాన్ని ఓ టీఎన్జీవోస్ నాయకుడి వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. టీఎన్జీవో నాయకుడి ద్వారా డీఈవో కార్యాలయ సిబ్బంది కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలనుకున్న అంశం అధికారికి తెలియడంతో ఆగమేఘాలపై సిబ్బందితో మాట్లాడి వారిని సముదాయించినట్లు సమాచారం. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జరుగుతున్న అన్ని విష యాలు బయటకు లీకేజీ కావడంతో సిబ్బందితో అధికారి సమావేశం నిర్వహించి, సిబ్బందికి వార్నింగ్ ఇవ్వగా సిబ్బంది బదులుగా గట్టిగానే జవాబు ఇవ్వడంతో ఒకానొక దశలో వాగ్వాదాలు చేసుకొని సిబ్బంది సమావేశం మధ్యలోనే బయటకు వచ్చినట్లు సమాచారం.
విద్యాశాఖాధికారిగా సదరు అధికారి బాధ్యత లు చేపట్టినప్పటి నుంచి కార్యాలయ సిబ్బందితో సఖ్యతగా ఉండడం లేదు. ఈ వి షయంలో సిబ్బందిని సైతం నమ్మకుండా బయట వ్య క్తుల ద్వారా సదరు అధికారి పనులు చేయించుకుంటున్నారు. జిల్లా విద్యాశాఖ ఆవరణలో జరుగుతున్న అభి వృద్ధి పనుల విషయంలోనూ కార్యాలయ సిబ్బందిని భాగస్వామ్యం చేయకుండా బయట వ్యక్తులచేత పనులు చే యించడంపై సిబ్బంది ఆగ్రహంగా ఉన్నారు. త్వరలో నూ తన కలెక్టరేట్‌కు తరలించే కార్యాలయానికి మరమ్మతుల పేరిట తమ దగ్గరినుంచి డబ్బులు వసూలు చేయడంపై సిబ్బంది ఇదివరకే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా విద్యాశాఖలో ఫైళ్ల పెండింగ్‌పై కూడా సిబ్బందికి అధికారికి పొసగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఆరు నెలలుగా కదలని ఫైళ్లు
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆరు నెలలుగా ఫైళ్ల కదలిక మందకొడిగా సాగుతోంది. ప్రతీ ఫైలుకు సంబంధిత సిబ్బంది క్లారిఫికేషన్ ఉంటేనే సదరు అధికారి సం తకాలు చేస్తున్నారు. చిన్న తప్పిదం ఉన్నా ఫైలును రిటర్న్ పంపడం, లేదా రెజెక్ట్ చేయడం చేస్తున్నారు. ఆ రు నెలలుగా జిల్లాకు సంబంధించిన ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు, క్రమబద్ధీకరణ సంబంధించిన ఫైళ్లు ఒక్క టంటే ఒక్కటి సంతకాలు కాకపోగా తనకేమీ సంబఽంధం లేదన్నట్లు సెక్షన్ లేదా సంబంధిత ఎంఈవోలకు ఫైళ్లను రిటర్న్ చేస్తున్నారు. ఈ విషయంలో సిబ్బంది అనేక ఇ బ్బందులను ఎదుర్కొవడమే కాకుండా ఫైళ్లకు సంబంధించిన నోట్స్ రాసేందుకు తంటాలు పడుతున్నారు.
చెట్లను నరికి.. మొక్కలు నాటి
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కొన్నేళ్లుగా చెట్ల అభివృద్ధి పేరుతో తొలగించి ఇప్పుడు మాత్రం హరితహారం పేరుతో అధికారి మొక్కలు నాటడం అనేక విమర్శలకు తావిస్తోంది. చెట్లను నరకడం నేరమైనప్పటికీ అభివృద్ధి పేరుతో యథేచ్చగా చెట్లను నరికేయించిన సదరు అధికారి ఇప్పుడు మాత్రం ఉపాధ్యాయ సంఘాల నేతలతో కలిసి చెట్లను నాటడంపై విమర్శలు వస్తున్నాయి. మంచి చెట్లను నరికివేసి ఇప్పుడు మొక్కలు నాటడం వల్ల ప్రయోజనం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
అధికారి తీరుపై కొన్ని విద్యాసంస్థల గుర్రు...
జిల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ యన వ్యవహారశైలిపై కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యా లు గుర్రుగానే ఉన్నాయి. ఆరు నెలలుగా ఒక్క ప్రైవేట్ పాఠశా ల ఫైళ్లు కూడా క్లియర్ చేయకపోవడంపై వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇ ప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు అధికారి తీరుపై అసం తృప్తిని వ్యక్తం చేయగా పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ట్లు తెలుస్తోంది. విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి, అధికారికి మధ్య వివాదం చిలికిచిలికి గాలివానగా మారి కలెక్టర్ వరకు పంచాయితీ చేరి తమకు న్యాయం జరిగేలా చూడాలని విద్యాశాఖ సిబ్బందిని కోరుతున్నారు. ఈ విషయ మై డీఈ వోను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నిం చగా ఆయన అందుబాటులోకి రాలేదు.