‘ప్రభుత్వ భూముల ఆక్రమణ’

ABN , First Publish Date - 2020-12-31T04:51:00+05:30 IST

నగరంలోని నాగారం ప్రాం తంలో ప్రభుత్వ భూమితో పాటు ఇతర ఇళ్ల స్థలాలను మేయర్‌ భర్తతో పాటు ఇతరులు ఆక్రమించుకుంటున్నారని బీజేపీ నగర అధ్యక్షుడు, బీజే వైఎం జిల్లా అధ్యక్షుడు పంచరెడ్డి లింగం, రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు.

‘ప్రభుత్వ భూముల ఆక్రమణ’
నాగారంలో పర్యటిస్తున్న బీజేపీ నాయకులు

 మేయర్‌ భర్తపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్‌ 

పెద్దబజార్‌/సుభాష్‌నగర్‌, డిసెంబరు 30: నగరంలోని నాగారం ప్రాం తంలో ప్రభుత్వ భూమితో పాటు ఇతర ఇళ్ల స్థలాలను మేయర్‌ భర్తతో పాటు ఇతరులు ఆక్రమించుకుంటున్నారని బీజేపీ నగర అధ్యక్షుడు, బీజే వైఎం జిల్లా అధ్యక్షుడు పంచరెడ్డి లింగం, రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. నాగారంలో బుధవారం బీజేపీ నగర శాఖ, బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వ ర్యంలో 10, 11 డివిజన్‌ ప్రాంతంలో పర్యటించారు. పలువురి నుంచి వివరాలను సేకరించారు. కొన్ని నెలలుగా భూములన్నీ ఆక్రమించుకొని ఇత రులకు అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. మేయర్‌ పదవికి డబ్బు లు పెట్టానని ఆ ఖర్చులు వెళ్లదీసుకునేందుకే ఈ అమ్మకాలు చేస్తున్నా రని బహిరంగంగానే ఆయన చెబుతున్నారని విమర్శించారు. ప్రజలకు సేవ  చేస్తామని వచ్చి పేద ప్రజల భూములను ఆక్రమించుకుంటున్నారని విమర్శించారు. నగర ఎమ్మెల్యేతో పాటు  ఇతరులు కలుగచేసుకొని పేదలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పేదల భూములను తిరిగి ఇవ్వకుంటే పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నగర కార్పొరేటర్‌ న్యాలం రాజు, నిచ్చెంగ కృష్ణ, మహిళా కార్పొరేటర్‌లు, బీజేపీ, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.      

బల్దియాలో నిధుల దుర్వినియోగం

ఆర్మూర్‌టౌన్‌ : మున్సిపాలిటీలో పెద్ద మొత్తంలో నిధులు దుర్విని యోగం జరుగుతోందని బీజేపీ ఫ్లోర్‌లీడర్‌ జీవీ.నరసింహారెడ్డి, కౌన్సిలర్‌ సాయికుమార్‌, నాయకులు ఆకుల శ్రీనివాస్‌, కొంతం మురళి, పాలెపు రా జు, ఆకుల రాజు ఆరోపించారు. బుధవారం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో విలే కరుల సమావేశంలో మాట్లాడారు. ఏడాది కాలంగా కౌన్సిల్‌కు జమా ఖ ర్చులు చూయించలేదన్నారు. అడ్డగోలుగా చెల్లింపులు చేస్తున్నారన్నారు. మెగా కంపెనీ నుంచి వాపసు వచ్చిన రూ.9కోట్లు ఏంచేశారని ప్రశ్నించా రు. పట్టణ ప్రగతిలో ఏఏ పనులు చేపట్టారని, ఎవరికి చెల్లింపులు చే శారని, మున్సిపాలిటీలో ఎలాంటి కమిటీలు లేకుండా చెల్లింపులు చేస్తు న్నారని, నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకో వడంలేదన్నారు. అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-12-31T04:51:00+05:30 IST