బాల్య వివాహ యత్నాన్ని అడ్డుకున్న అధికారులు
ABN , First Publish Date - 2020-12-11T05:20:07+05:30 IST
మండలంలోని స్టేషన్ ఏరియాకు చెందిన పధ్నాలుగేళ్ల బాలికకు కుటుంబసభ్యులు వివాహ యత్నం చేయడాన్ని గురువారం అధికారులు అడ్డుకున్నారు.

నవీపేట, డిసెంబరు 10: మండలంలోని స్టేషన్ ఏరియాకు చెందిన పధ్నాలుగేళ్ల బాలికకు కుటుంబసభ్యులు వివాహ యత్నం చేయడాన్ని గురువారం అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని ఓ గ్రామంలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికకు కుటుంబసభ్యులు వివాహ యత్నం చేస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు స్టేషన్ ఏరియాకు వచ్చి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండే వరకు బాలికకు వివాహం చేయబోమని కుటుంబసభ్యులనుంచి హామీపత్రం తీసుకున్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ స్వర్ణలత, బాలికా సంరక్షణ అధికారులు, సర్పంచ్ షకీల్ తదితరులున్నారు.