బస్సు ఢీకొని నాగారం వాసి మృతి

ABN , First Publish Date - 2020-11-21T11:28:09+05:30 IST

డిచ్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధి ధర్మారం శివారులో గురువారం రాత్రి రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్క డికక్కడే మృతిచెందాడని ఎస్‌ఐ సురేష్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు.

బస్సు ఢీకొని నాగారం వాసి మృతి

డిచ్‌పల్లి, నవంబరు 20: డిచ్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధి ధర్మారం శివారులో గురువారం రాత్రి రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్క డికక్కడే మృతిచెందాడని ఎస్‌ఐ సురేష్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. ఘన్‌పూ ర్‌లో బంధువుల ఇంటికి వచ్చిన మహమ్మద్‌ మహబూబ్‌ (54) రోడ్డును దాటు తుండగా, కామారెడ్డి నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్తున్న ఏపీ 29 జడ్‌ 1988 ని జామాబాద్‌ ఒకటో డిపో బస్సు ఢీకొందన్నారు. మహమ్మద్‌ మహబూబ్‌ కుమా రుడు లతీఫ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

Read more