చెరుకుకు రూ.3500 మద్దతు ధర చెల్లించాలి
ABN , First Publish Date - 2020-11-21T11:22:36+05:30 IST
సదాశివనగర్ మండలం గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెరుకు ధర టన్నుకు రూ.3500 చెల్లిం చాలని చెరుకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు గోపాల్‌రావు అన్నారు.

సదాశివనగర్, నవంబరు 20: సదాశివనగర్ మండలం గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెరుకు ధర టన్నుకు రూ.3500 చెల్లిం చాలని చెరుకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు గోపాల్‌రావు అన్నారు. శుక్రవారం చెరుకు ఉత్పత్తిదారుల కార్యవర్గసమావేశం ఏర్పాటుచేసి సమస్యలపై సీజీఎం వెంకట్రావుకు వినతి పత్రం అందించారు. పెట్టుబ డి ఖర్చులు పెరిగిన దృష్ట్యా గతంలో చెల్లించిన చెరుకు ధరవలన రైతులకు నష్టం జరుగుతుందన్నారు. మద్దతు ధర పెంచి రైతుకు కావా లసిన విత్తనం ఎరువులు కలుపు మందులను రైతులకు సకాలంలో అందజేస్తు చెరుకు సరఫరా చేస్తున్న రైతులకు టన్నుకు కిలోచక్కెర అందజేయాలన్నారు. కార్యక్రమంలో సభ్యులు రాజలింగం, దశరథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.