సన్నాలకు మద్దతు ధర ఇవ్వకుండా కేంద్రం జీవో
ABN , First Publish Date - 2020-11-21T11:18:30+05:30 IST
రైతులు పండించిన వరి ధాన్యానికి రూ.1888 కంటే ఎక్కువ మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి కొంటే దానిని రూ.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కంటే ఎక్కువ కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో జీవో ఇచ్చిందని, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నమని ప్ర భుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు.

ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
రామారెడ్డి,నవంబరు20: రైతులు పండించిన వరి ధాన్యానికి రూ.1888 కంటే ఎక్కువ మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి కొంటే దానిని రూ.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కంటే ఎక్కువ కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో జీవో ఇచ్చిందని, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నమని ప్ర భుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని సింగరాయపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ పంచా యతీ భవనం,డ్రైనేజీని ప్రారంభించారు. మొదటగా రెడ్డిపేట శివారులో రూ.41 లక్షలతో నూతనంగా ని ర్మించిన వంతెనను ప్రారంభించారు.అనంతరం గ్రా మంలో రూ.16 లక్షలతో నిర్మించిన జీపీ భవనాన్ని ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమా వేశంలో మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. రూ. 1888 కంటే ఎక్కువ మద్దతు ధర ఇస్తే కేంద్ర ప్రభుత్వం కొనదని ఇచ్చిన జీవో కాపీని చూపిస్తూ మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
రైతులకు అనుగుణంగా సన్నాలకు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ఇ స్తామంటే కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని ఆరోపించారు. మోడీ రూ. 15 సీఎంగా పనిచేసి ఇప్పుడు ఏడేళ్లుగా పీఎంగా కొనసాగుతూ కూడా ఇదే నా రైతులను ఆదుకునే విధానం అని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులను ఆదుకొనేందుకు సీఎం కేసీఆర్ త్వరలోనే పరిష్కారం చూపించబోతున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థిల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలను సహించేది లేదని హెచ్చరించారు. గ్రామంలో ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.పది లక్షలు సీసీ రోడ్లకు మంజూరు ఇస్తున్న ట్లు తెలిపారు. అలాగే విద్యుత్ వైర్లు సరిగా లేవని గ్రామస్థులు చెప్పడం తో ట్రాన్స్‌కో డీఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 15రోజుల్లో విద్యుత్ వైర్లు సరిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ దశరథ్‌రెడ్డి, రైతుబం ధు మండలాధ్యక్షుడు నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గోపాల్ రెడ్డి, సర్పంచ్ మహేశ్వరి నర్సాగౌడ్, మాజీ జడ్పీటీసీ రాజేశ్వరరావు, రాంరె డ్డి, రాజాగౌడ్, బుచ్చిరెడ్డి, బాలరాజు, శ్రీనివాస్‌రెడ్డి, స్వామిగౌడ్, రాజయ్య, సాయిలు, భూమయ్య, రాజేందర్‌గౌడ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.