సాందీపనిలో జాబ్‌మేళా
ABN , First Publish Date - 2020-11-21T11:07:42+05:30 IST
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాం దీపని కళాశాలలో శుక్రవారం డీఆర్‌డీఏ, కళాశాల ఆధ్వర్యంలో రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు.

కామారెడ్డిటౌన్, నవంబరు 20: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాం దీపని కళాశాలలో శుక్రవారం డీఆర్‌డీఏ, కళాశాల ఆధ్వర్యంలో రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. 2019-20 విద్యా సంవత్సరంలో కెమిస్ట్రీ సబ్జెక్టుతో డిగ్రీ పూర్తిచేసుకున్న విద్యార్థులకు ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. ఇందులో దాదాపు 40 మంది హాజరవ్వగా అందులో మంచి ప్రతిభ కనభరిచిన వారికి మౌఖిక పరీక్ష నిర్వహించి జాబ్‌లను అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో రెడ్డీస్ ల్యాబ్ ప్రతినిధి చక్రధర్, డీఆర్‌డీఏ సిబ్బంది శ్రీధర్, సాందీపని కళాశాల యాజమాన్యం హరిస్మరన్‌రెడ్డి, అశోక్‌రావు, బాలాజీరావు, కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కుమార్, మనో జ్, రాజు తదితరులు పాల్గొన్నారు.