26లోగా నిర్మాణాలు పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-11-21T11:06:18+05:30 IST

శ్మశాన వాటికల నిర్మాణాలను ఈ నెల 26 లోగా పూర్తిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అధికారులను ఆదేశించారు

26లోగా నిర్మాణాలు పూర్తిచేయాలి

కామారెడ్డిటౌన్‌, నవంబరు 20: శ్మశాన వాటికల నిర్మాణాలను ఈ నెల 26 లోగా పూర్తిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జనహితభవన్‌లో వీడియో కాన్పరెన్స్‌లో అధికారులతో మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనంలో వంద శాతం మొక్కలు ఉండే విధంగా చూ డాలని, కంపోస్ట్‌ షెడ్లను వినియోగంలోకి తెచ్చి సేంద్రియ ఎరు వులను తయారుచేయాలని సూచించారు. గ్రామపంచాయతీల ఆదా యాన్ని పెంపొందించుకోవాలని, రైతు కలాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్‌ అధికారులు, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో చంద్రమోహన్‌రెడ్డి, ఇన్‌చార్జి డీపీవో సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Read more