కాసులకు కక్కుర్తి

ABN , First Publish Date - 2020-11-21T10:56:44+05:30 IST

అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించాల్సిన పోలీసులే.. అవినీతికి తెరలేపి.. కాసులకు కక్కుర్తిపడి తమ విఽధులను విస్మరిస్తూ ప్రజల్లో అభాసుపాలవుతున్నారు.

కాసులకు కక్కుర్తి

 ఉమ్మడి జిల్లాలో అవినీతి ఆరోపణలతో అభాసుపాలవుతున్న పోలీసులు

 ప్రజాప్రతినిధులు, పోలీసుల మిలాఖత్‌తో  విధుల కంటే అవినీతిపైనే ఫోకస్‌

 అక్రమార్కులకు వంతపాడుతూ కేసులు  లేకుండా చేస్తామంటూ వసూళ్లు

 కామారెడ్డి పట్టణ సీఐపై ఏసీబీ అధికారుల విచారణతో ఉమ్మడి జిల్లాలో మరోమారు పోలీసులకు మచ్చ

 సీఐ మెడకు చుట్టుకున్న స్కీంల వ్యవహారం

 15 రోజుల వ్యవధిలోనే ఉమ్మడి జిల్లాలో ముగ్గురు సీఐలపై ఏసీబీ నజర్‌


కామారెడ్డి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించాల్సిన పోలీసులే.. అవినీతికి తెరలేపి.. కాసులకు కక్కుర్తిపడి తమ విఽధులను విస్మరిస్తూ ప్రజల్లో అభాసుపాలవుతున్నారు. 15 రోజుల వ్య వధిలోనే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ముగ్గురు సీఐలు ఏసీబీ అధికారులకు పట్టుబడడాన్నే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇటీవలి కాలంలో జిల్లాలో పోలీసులే సెటిల్‌ మెంట్‌లు చేస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిపో యి పంచాయితీ పెద్దలుగామారి రాజీ కుదురుస్తున్నారు. పోలీస్‌ స్టేషన్‌లనే సెటిల్‌మెంట్‌ అడ్డాలుగా మార్చేస్తున్నారు.   సివిల్‌ తగాదాలు, భూపంచాయితీలు, కుటుంబ గొడవలలో, ఇతర చీటింగ్‌ కేసులలో తలదూర్చుతూ రాజీకుదిర్చేందుకే పలువురు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. గుట్కా, ఐపీఎల్‌ బెట్టింగ్‌, కలప అక్రమ రవాణాలాంటి వాటిని కట్ట డి చేయాల్సింది పోయి..


ఎవరైనా సమాచారం అందిస్తే వి చారణ పేరుతో తీసుకువచ్చి కాసుల బేరం కుదుర్చుకుంటు న్నారు. కేసులు లేకుండా చేస్తామంటూ లక్షలాది రూపాయలు డిమాండ్‌ చే సి అందిన కాడికి దండుకోవడమే కాకుండా కక్కుర్తితో మళ్లీ వెళ్లి మరికొన్ని డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తుండడంతో భాదితులు ఏసీబీ అధికారులను ఆశ్ర యిస్తున్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేం ద్రంలో వెలు గుచూసిన పట్టణ సీఐ జగదీష్‌ వ్యవహారమే ఇందుకు నిదర్శనంగా చేప్పుకోవ చ్చు. కామారెడ్డిలో బె ట్టింగ్‌ వ్యవహారంతో పా టు ఇటీవల చాలాచోట్ల అనుమతులు లేకుండా నిర్వహించిన స్కీంలు, లక్కీడ్రాలలో సీఐ మా మూళ్లు వసూలు చేసి, డబ్బుల విషయంలో ప లువురు నాయకులపై ఒత్తిడి తీసు కురావడం తో పాటు ఓ పోలీసు అధికారి, సీఐ మధ్య పంపకాలలో తేడాలు వచ్చినట్లు ఆరోపణ లు వినిపిస్తున్నాయి. ఐపీఎల్‌ బెట్టింగ్‌ ముఠా వ్యవహారంతో పాటు స్కీంల వ్య వహారమే సీఐ మెడకు చుట్టుకున్నట్టు తెలిసింది.


పంచాయితీలతో వసూళ్లకు ప్రాధాన్యం?

ప్రస్తుత సమాజంలో భూ వివాదా లు, ఆస్తుల తగదాలు, కుటుంబంలో గొడవలు, రోడ్లపై అమ్మాయిలపై ఆక తాయిల వేధింపులు, కట్నం కోసం వేధించే అత్తింటి వారి పంచాయి తీలు ఉండని గ్రామాలు, పట్టణా లు ఉండవు. ఇలాంటి సమస్యలు రాగానే వెంటనే పోలీసు స్టేషన్‌ మెట్లెక్కుతున్నారు. అయితే, పోలీసులు మాత్రం ఇ లాంటి పంచాయితీలలో కేసులు నమోదు చేయకుండా బే రాలు మాట్లాడి రాజీ కుదుర్చేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజువారీ కూలిపనులకు వెళ్లే పేదలు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు, పలువురు వ్యా పారులు పోలీసు స్టేషన్‌ చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తుందనే భయంతో అధికారులు చెప్పిన మాటాలు వింటు న్నారు. దాంతో పోలీసు స్టేషన్‌లలోనే పంచాయితీలు పరిష్కారమవుతున్నాయనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో కొందరు సిబ్బంది, అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే అలా స్టేషన్‌లలో నిర్వహించే సెటిల్‌మెంట్లలో అధికంగా భూములకు సంబం ధించినవి, కుటుంబీకుల ఆస్తుల తగదాలతో పాటు ఐపీఎల్‌ బెట్టింగ్‌లో మోసపోయిన వారు ఉంటే వారికి ఎంతో కొంత అందించి తర్వాత బేరాలు మాట్లాడి రాజీ కుదురుస్తున్నారు. 


 పోలీసుల తీరుతో ఏసీబీని ఆశ్రయిస్తున్న బాధితులు

ఉమ్మడి జిల్లాలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది తీరు విమర్శలకు తావిస్తోంది. సివిల్‌ తగదాలలో తల దూర్చు తూ ఇరువర్గాలపై కేసులు న మోదు చేసినప్పటికీ వారిని రాజీ కుదిర్చే క్రమంలో పలువురు పోలీసు లు అవినీతికి పాల్పడుతున్నట్లు తె లుస్తోంది. ఇటీవలి కాలంలో నిజా మాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో పలు వురు పోలీసు అధికారులు ఫిర్యాదుదా రుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీ బీకి పట్టుబడ్డారు. గతంతో బాన్సువాడ రూరల్‌ సీఐ టాటాబాబు.. చెక్‌బౌన్స్‌ కేసులో రూ.50 వేలు ఇస్తే కేసుకొట్టివేస్తున్నంటూ ఓ కాంట్రాక్టర్‌తో బేరమాడి చివరకు రూ.20వేలకు ఒప్పందం కుదుర్చుకు న్నాడు. అయితే, సదరు కాంట్రాక్టర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా..


సీఐ తన ఇంట్లో కాంట్రాక్టర్‌ నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలాగే బోధన్‌ పట్టణ సీఐ రాకేష్‌గౌడ్‌.. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి, అధికార పార్టీ నాయకు ల మధ్య భూతగదా విషయంలో కలగజేసుకుని కేసు నమో దు చేసి కేసు రాజీ కుదిర్చే విషయంలో రియల్‌ఎస్టేట్‌ వ్యా పారిని డబ్బులు డిమాండ్‌ చేయడంతో అతడు ఏసీబీని ఆ శ్రయించాడు. పోలీస్‌ స్టేషన్‌లోనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రూ.50వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకు న్నారు. తాజాగా కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్‌ సీఐ సైతం గతంలో తాను పనిచేసిన చోట అవినీతికి పాల్పడడాన్ని, ప్ర స్తుతం ఐపీఎల్‌ బెట్టింగ్‌ విషయంలో పట్టుబడ్డ ముఠా స భ్యులపై కేసులు చేయకుండా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో పాటు స్కీంలు, లక్కీడ్రాలు నిర్వహిస్తున్న వా రి నుంచి సైతం రూ.లక్షలలోనే వసూలు చేశారనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి.


ఇలా వసూలు చేసిన డబ్బుల పంపకా లలో ఓ పోలీసు అధికారికి, సీఐకి మధ్య తేడా వచ్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బుల విషయంతో ఒత్తిడికి గురిచేయడంతో భాదితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిం చారని తెలిసిం ది. ఇలా ఉమ్మడి జిల్లాలో పలువు రు పోలీసులు అవినీతి ఆరోప ణలు ఎదుర్కోవడంపై పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది.

Updated Date - 2020-11-21T10:56:44+05:30 IST