రైతు వ్యతిరేక పార్టీ బీజేపీ

ABN , First Publish Date - 2020-11-19T10:10:23+05:30 IST

రైతు వ్యతిరేక పార్టీ బీజేపీ అని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం మోపాల్‌ మండలంలోని మోపాల్‌, మంచిప్ప గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు వేదిక భవనాలను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌లు ప్రారంభించారు.

రైతు వ్యతిరేక పార్టీ బీజేపీ

మోపాల్‌, నవంబరు 18: రైతు వ్యతిరేక పార్టీ బీజేపీ అని నిజామాబాద్‌  రూరల్‌ ఎమ్మెల్యే  బాజిరెడ్డి గోవర్ధన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం మోపాల్‌ మండలంలోని మోపాల్‌, మంచిప్ప గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు వేదిక భవనాలను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దని అన్నారు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన కూడా పోలేకపోతున్నారని వివరించారు.


ఇక్కడ కేసీఆర్‌ రైతుల కోసం రైతు బీమాతో పాటు రైతులకు ఇన్సూరెన్స్‌, రుణ మాఫీ, రైతులకు సబ్సిడీపై రుణాలు ఇవ్వడంతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇటువంటి పథకాలు లేవన్నారు. కొందరు బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని దేశం కోసం చేసింది ఏమీ లేదని, బీజేపీ నాయకులు మాత్రం ప్రధాని ఎంతో చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రైతులు సమావేశాలు, సభలను జరుపుకునేందుకు సీఎం కేసీఆర్‌ మంచి ఆలోచనలతో రైతు వేదికలను గ్రామాల్లో నిర్మిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 28 రైతువేధికలను నిర్మించడం జరిగిందని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే వి.జి.గౌడ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ధర్పల్లి జడ్పీటీసీ జగన్‌, ఎంపీపీ లత, జడ్పీటీసీ కమల, వైస్‌ ఎంపీపీ అనిత, ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ మోహన్‌, నాయకులు శ్రీనివాస్‌రావు, డి.కిశోర్‌రావు, చంద్రశేఖర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, మోపాల్‌ మండల టీఆర్‌ఎస్‌  పార్టీ అధ్యక్షులు ముత్యంరెడ్డి, గ్రామ సర్పంచ్‌ సిద్దార్థ, రవి, గంగాప్రసాద్‌, సాయరెడ్డి, ఉమాపతిరావు, రింగుల భూమయ్య, రాజశేఖర్‌రెడ్డి, భూమయ్య, దేవిదాస్‌, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 


గుండారంను మండలం చేస్తాం

నిజామాబాద్‌ రూరల్‌ : గతంలో ఇచ్చిన హామీ మేరకు గుండారం గ్రామాన్ని మండలంగా చేసి తీరతామని రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. బుధవారం రూరల్‌ మండలం గుండారం గ్రామంలో నూతనంగా నిర్మించిన మొటాడి రెడ్డి సంఘ భవనాన్ని ఎమ్మెల్సీ వీజీగౌడ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం బాజిరెడ్డి మాట్లాడుతూ... గతంలో పాలించినవారు రూరల్‌ గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదని తాను ఎమ్మెల్యే అయిన తర్వాత రూరల్‌ గ్రామాల రోడ్లకు కోట్లాది రూపాయలతో నిర్మించామని తెలిపారు. ఒకప్పటి గుండారంకు ఇప్పటి గుండారం పోలికే లేదన్నారు.


సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాలవారి అభివృద్ధి జరుగుతుందన్నారు. అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్‌, వీజీగౌడ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు బాజిరెడ్డి గోవర్ధన్‌, సుమలత, ఎంపీటీసీ అంకల గంగాధర్‌, సర్పంచ్‌ లక్ష్మణ్‌రావు, ఉపసర్పంచ్‌ శంకర్‌ రెడ్డి, రెడ్డిసంఘం నేతలు గోపాల్‌రెడ్డి, రాజారెడ్డి, కొండెల నర్సారెడ్డి, ఒంటెల రవీందర్‌ రెడ్డి, మిర్యాల హన్మంత్‌రెడ్డి, దశరథ్‌రెడ్డితోపాటు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-19T10:10:23+05:30 IST