‘డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్సులు జారీ చేయాలి’

ABN , First Publish Date - 2020-11-19T10:07:35+05:30 IST

రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియను సక్రమంగా నిర్వహిస్తున్న డాక్యుమెంట్‌ రైటర్లకు ప్రభుత్వం లైసెన్సులను జారీ చేసి ఆదుకోవాలని డాక్యుమెంట్‌ రైటర్ల సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు అవేజ్‌ అహ్మద్‌, శ్రావణ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

‘డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్సులు జారీ చేయాలి’

ఖిల్లా, నవంబరు  18 : రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియను సక్రమంగా నిర్వహిస్తున్న డాక్యుమెంట్‌ రైటర్లకు ప్రభుత్వం లైసెన్సులను జారీ చేసి ఆదుకోవాలని డాక్యుమెంట్‌ రైటర్ల సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు అవేజ్‌ అహ్మద్‌, శ్రావణ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలోని కవిత కాం ప్లెక్స్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రిజిస్ట్రేన్లకు వచ్చే వినియోగదారులకు అన్ని డా క్యుమెంట్లు సరిగ్గా రాసి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 300 మంది డాక్యుమెంట్‌ రైట ర్లు ఉన్నారన్నారు. వారిపై ఆధారపడి మరి కొన్ని కుటుంబాలు జీవనం సాగిస్తున్నారన్నారు.


రిజిస్ర్టేషన్ల వ్యవస్థను రెవెన్యూ శాఖలో విలీనం చేస్తున్నందున డాక్యుమెంట్‌ రైట ర్లు వీధిన పడే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. డాక్యుమెంట్‌ రైటర్లను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీ ఆర్‌ సెప్టెంబరు9న అసెంబ్లీ సమావేశాల్లో డాక్యుమెంట్‌ రైటర్ల పొట్టకొట్టనని, వారి ఉపాధి అవకాశాలను మెరుగు పర్చేందుకు వారికి లైసెన్సులు జారీ చేస్తానని చెప్పడం జరిగిందని వారు గుర్తు చేశారు. సీఎం చెప్పిన ప్రకారం డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్సులు జారీ చేయాలని కోరారు. సమావేశంలో మఖ్దూమ్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-19T10:07:35+05:30 IST