పూర్తిచేసిన పనులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

ABN , First Publish Date - 2020-11-19T10:04:18+05:30 IST

పనులు నిర్ణీత సమయంలో పూర్తిచేయడమే కాకుండా వాటిని ఆన్‌లైన్‌లో కూడా కనిపిం చే విధంగా నమోదు చేయించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.

పూర్తిచేసిన పనులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 18: పనులు నిర్ణీత సమయంలో  పూర్తిచేయడమే కాకుండా వాటిని ఆన్‌లైన్‌లో కూడా కనిపిం చే విధంగా నమోదు చేయించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయం త్రం క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో పల్లె ప్రగతి, డ్రైయింగ్‌ ప్లాట్‌ఫాం నిర్మాణం గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 416 డ్రైయింగ్‌ ప్లాట్‌ఫాంలు పూర్తయ్యాయని అధికారులు నివేదిక ఇచ్చినప్పటికీ అవి ఆన్‌లైన్‌లో ఇంకా నమోదు అ యినట్లు కనిపించడం లేదని, ఎప్పటికప్పుడు పూర్తిచేసిన పనులను అంతే ప్రాధాన్యతతో ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలన్నారు.


అప్పుడే జిల్లాలో నిర్వహిస్తున్న పనులు రాష్ట్ర అధికారుల దృష్టికి వెళుతుందని, లేదంటే చిన్న పనులకు కూడా గుర్తింపు ఉండదన్నారు. ఏ విధంగా పల్లె ప్రగతి వ నాలు ఏర్పాటు చేసే చోటే స్థల సేకరణ, ఖర్చుల అంచనా లు తదితర వివరాలను వెంటనే పూర్తిచేసి పనులు ప్రారంభించుటకు చర్యలు తీసుకోవాలన్నారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఆర్‌డీవో శ్రీనివాస్‌, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-19T10:04:18+05:30 IST