నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2020-11-19T10:03:34+05:30 IST

నిజామాబాద్‌లోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని రాష్ట్రంలోనే ఉన్న తమైన సేవలందించే విధంగా తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి ఆసుపత్రి వైద్య అధికారులను ఆదేశించారు.

నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని తీర్చిదిద్దాలి

నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 18: నిజామాబాద్‌లోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని రాష్ట్రంలోనే ఉన్న తమైన సేవలందించే విధంగా తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి ఆసుపత్రి వైద్య అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్‌లో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, సదుపాయాలు, నాణ్యమైన సేవలు, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, మిషనరీ తదితర సదుపాయాలతో పాటు ఆసుపత్రి అభివృద్ధికి ఇంకా ఏంచేయాలో కులంకషంగా వైద్యాధికారులతో సమీ క్షించారు. అవసరమైన చర్యలు తీసుకోవడం తో పాటు ఒక ప్రణాళిక సిద్ధం గా చేయాలని ఆదే శించారు.


మెరుగైన సే వలు అందించడానికి కమిటీని వేసి ఆ కమిటీ ఆధ్వ ర్యంలో లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి ని పూర్తిచేయుటకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. సాధారణ సేవలతో పాటు ఆరోగ్యశ్రీ సేవలు మరింత మెరుగుపరిచి కార్పొరేట్‌ ఆసుపత్రులకు బదులుగా ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు వచ్చే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన ఆదాయ వనరులపై కూడా ఆలోచించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి భవనంలో కొనసాగుతున్న నర్సింగ్‌ కళాశాలను మాక్లూర్‌కు తరలించి ప్రస్తుతం ఉన్న భవనాన్ని వైద్యసేవలకు ఉపయోగించాలని ఆదేశించారు. ఆసుపత్రి భవనం చిన్న చిన్న మర మ్మతులు, సివిల్‌ వర్క్స్‌, లీకేజీలు, యంత్రాలు చెడిపోతే వాటి మరమ్మతులపై తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలన్నారు.


ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధికి మెరుగైన సేవలు తీసుకోవాల్సిన చర్యలపై ఆసు పత్రి పర్యవేక్షకురాలు డాక్టర్‌ ప్రతిమారాజ్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌లు డాక్టర్‌ వెంకట్‌, బాల్‌రాజ్‌, హరీష్‌, స ర స్వతి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఇందిర, విశాల్‌, తిరుపతిరావు, ఫారీదా, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.


అంబులెన్స్‌ ప్రారంభం...

ఓ అజ్ఞాత ధాత విరాళంగా ఇచ్చిన అంబులెన్స్‌ను కలెక్టర్‌ బుధవారం ప్రారంభించారు. ప్రభుత్వ ఆ సుపత్రిలో అందిస్తున్న మెరుగైన సేవలకు గాను తన పేరు చెప్పుకోవడం ఇష్టం లేని ఆ దాత దగ్గర ఉండి అంబులెన్స్‌లో అవసరమైన అన్ని అధునాతన సౌకర్యాలు  ఏ ర్పాటు చేయించాలని తాత్కాలికంగా చికిత్స అం దించడానికి అవసరమైన సామగ్రి అంబులెన్స్‌లో సమకూర్చాలని ప్రజలకు అత్యవసర సమయాల్లో వాహనం పం పించుటకు ఈ వాహనం ఉపయోగకరంగా ఉంటుందని ఆ అజ్ఞాత దాత ఈ అంబులెన్స్‌ను ఇచ్చారని తెలిపారు. కలెక్టర్‌ ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. 

Updated Date - 2020-11-19T10:03:34+05:30 IST