రిటైర్డ్‌ అయినా ఇక్కడే ఉంటా!

ABN , First Publish Date - 2020-11-19T09:54:11+05:30 IST

నగర పాలక సంస్థలో ఆయన ఒక డిప్యూటీ ఇంజనీర్‌. గత ఏడాది రిటైర్‌ అయినప్పటికీ పొడగింపు పేరుతో ఇక్కడే తిష్ట వేసి ఆయన హవాను కొనసాగిస్తున్నారు.

రిటైర్డ్‌ అయినా ఇక్కడే ఉంటా!

 నగర కార్పొరేషన్‌లో ఆయనదే హవా    

 షాడో కమిషనర్‌గా చెలామణి


నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 18:  నగర పాలక సంస్థలో ఆయన ఒక డిప్యూటీ ఇంజనీర్‌. గత ఏడాది రిటైర్‌ అయినప్పటికీ పొడగింపు పేరుతో ఇక్కడే  తిష్ట వేసి ఆయన హవాను కొనసాగిస్తున్నారు. వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఇంజనీరింగ్‌ విభాగంలో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన డిప్యూటీ ఇంజనీర్‌గా ఈ ఏడాది  ఏప్రిల్‌లో పదవి విరమణ చేశారు. వర్క్‌ ఇన్‌ స్పెక్టర్‌గా నిజామాబాద్‌ మున్సిపాలిటీలో ఉద్యోగిగా చేరిన ఆయన అప్పటి నుంచి ఇక్కడే పదోన్నతులు వచ్చినా పనిచేస్తూ ఉన్నాడంటే ఆయన హవా ఎంత ఉందో అర్థమవుతోం ది. గత 20 ఏళ్లకు పైగా కార్పొరేషన్‌లో అన్ని తానై వ్యవహరిస్తు న్న సదరు అధికారి రిటైర్‌ అయినా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా చేరి ఇప్పటికీ అదే హోదాలో పని చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నగర కార్పొరేషన్‌ పరిధిలో ఏ పని జరిగినా ఆయనకు తెలియాల్సిందే.


నగర కార్పొరేషన్‌కు కమిషనర్‌ ఉన్నతాధికారి అయిన సదరు రిటైర్డ్‌ అధికారి కనుసన్నల్లోనే కార్పొరేషన్‌  నడుస్తోంది. ఏ కౌన్సిల్‌ వచ్చినా, ఏ ప్రజాప్రతినిధి వచ్చినా వారికి అనుకూలంగా మారుతూ తన హవాను మాత్రం సదరు అధికారి కొనసాగిస్తున్నాడు. వాటర్‌ క్లోరినైజేషన్‌ మొదలుకొని సివిల్‌ పనులలో ఈయనకు తెలియనిది ఏది జరగడానికి వీలు లేదు. ఈయన అక్రమార్జన లక్షల్లో ఉందంటే ఆశ్చర్యం వేయక మానదు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి గరిష్టంగా రూ.12 వేలు వేతనం ఇవ్వాల్సి ఉండగా సదరు అధికారికి రిటైర్డ్‌ అయినా రూ.30వేల వేతనంతో పాటు కారు కూడా నగర కార్పొరేషన్‌ ఇస్తుందంటే ఈయన ఏ స్థాయిలో లాబీయింగ్‌ చేస్తున్నాడో అర్థమవుతోంది.


 షాడో కమిషనర్‌గా చెలామణి

ఇన్‌చార్జి డిప్యూటీ ఇంజనీర్‌గా ఈ  ఏడాది ఏప్రిల్‌ లో ఉద్యోగ విరమణ చేసిన సదరు అధికారి జూన్‌లో జరిగిన నగర పాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో ఏడాది పాటు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పొడగింపును ఇచ్చారు. ఈ విషయంలో కౌన్సిల్‌లో ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీజేపీ కార్పొరేటర్‌లు ఆందోళన నిర్వహించారు. ఎంతో మంది అధికారులు ఉండ గా సదరు అధికారికి పొడగింపు ఇవ్వడం ఏమిటని ఆయన అక్రమాలను ప్రస్తావించారు.


గత పాలకవర్గాల పాలనలోనూ, గతంలో మున్సిపల్‌ చైర్మన్‌, మేయర్‌లుగా పని చేసిన వారందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉండడం, వారికి అను కూలంగా ఉంటూ గత 20 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న సదరు అధికారి తన లాబీయింగ్‌తో ఏడాది పాటు పొడగింపును తెచ్చుకోవడం వివాదాస్పదమైంది. అప్ప టి నుంచి కార్పొరేషన్‌లో ఏ పనులు జరిగినా సదరు అధికారికి తెలియాల్సిందే. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి అయినప్పటికీ ప్రస్తుతం కూడా ఇన్‌ఛార్జి  డిప్యూటీ ఇం జనీర్‌గా ఆయన బాధ్యతలు నిర్వహించడం వెనుక ప్రజాప్రతినిధుల అండద ండలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


కార్పొరేషన్‌లో ఏ విషయమైనా ప్రజాప్రతినిధుల అండతో ఈయననే నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి కీ సదరు అధికారి హోదాకు తగ్గకుండా గ్రీన్‌పెన్‌, కారును వాడుతుండడం అనే క విమర్శలకు తావిస్తోంది. నగర కార్పొరేషన్‌లో షాడో కమిషనర్‌గా చెలామణి అవుతున్న ఈయన సంపాదన రూ.లక్షల్లో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 


 క్లోరినేషన్‌, సివిల్‌ పనుల్లో ఈయన పాత్ర కీలకం

నగర పాలక సంస్థ ప్రజలకు మంచినీటిని అందించేందుకు ఫిల్టర్‌ బెడ్‌ల ద్వారా క్లోరినేషన్‌ కోసం రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ప్రతీ ఏడాది కేవలం క్లోరినేషన్‌, ఫిల్టర్‌బెడ్‌ల నిర్వహణకు రూ. 50 లక్షల నుంచి 60 లక్షల వరకు ఖర్చు చేస్తుండగా బినామీ టెండర్‌ల పేరుతో సదరు రిటైర్డ్‌  డిప్యూటీ ఇంజనీర్‌ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. క్లోరినేషన్‌తో ఫాటు ఫిల్టర్‌బెడ్‌ల నిర్వహణను తూతూ మంత్రం గా ఖర్చు చేస్తూ  రూ.లక్షలు వెనకేసుకుంటున్నట్లు అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సివిల్‌ పనుల్లోనూ ఈ అధికారి హస్తం ఉంటుంది. ఏ పనికి ఎంత బిల్లు మంజూరు చేయాలన్నా సదరు అధికారి ఆమోదం ఉండాల్సిందే. ఎంత పని జరిగినా  బిల్లు మాత్రం ఎంత ఇవ్వాలో సదరు అధికారి చెప్పాల్సిందే.


 నిబంధనలకు విరుద్ధంగా పొడిగింపు.. న్యాలం రాజు, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, నగర పాలక సంస్థ.

నగర పాలక సంస్థ డిప్యూటీ ఇంజనీర్‌గా రిటైర్‌ అయిన ఉద్యోగిని నిబంధనలకు విరుద్ధంగా మెజారిటీ ఉందని పాలకవర్గం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా తీసుకోవడం దారుణం. ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతుంటే రిటైర్‌ అయిన ఉద్యోగికి ఔట్‌సోర్సింగ్‌ ద్వారా పొడిగింపు ఇవ్వడం ఆశ్చర్యకరం. అనేక అవినీతి ఆరోపణలతో పాటు అనేక ఏళ్లుగా ఇక్కడే ఉన్న ఆయనకు పొడగింపు ఇవ్వడం దురదృష్టకరం. అనుభవం పేరుతో సదరు అధికారికి పొడిగింపు ఇవ్వడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం. ఆయనను వెంటనే తొలగించాలని బీజేపీ తరఫున డిమాండ్‌ చేస్తున్నాను.

Updated Date - 2020-11-19T09:54:11+05:30 IST