కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-11-13T11:17:44+05:30 IST

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకులు గురువారం జిల్లా అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డికి వినతి పత్రం అందించారు.

కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి టౌన్‌, నవంబరు 12: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకులు గురువారం జిల్లా అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కామారెడ్డిని ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుస్తామని హామి ఇస్తే కళాశాలకు చివరలో ఉన్న స్థలాలు కబ్జాకు గురై, వాటిని అమ్మి, ఇళ్లు కూడా కట్టించిన కబ్జాదారులు అర్బన్‌ పార్కుల పేరిట ఆ ఇళ్లకు రోడ్లు వేసే చర్యలకు పూనుకుంటున్నారని అన్నారు. వెంటనే అర్బన్‌పార్క్‌ ఏర్పాటు విరమించుకొని ప్రహరీ నిర్మించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిద్ధిరాములు, జగన్నాథం, నర్సింహా రెడ్డి, దశరథ్‌, వెంకట్‌గౌడ్‌, చంద్రశేఖర్‌, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-13T11:17:44+05:30 IST