రైతుల అభివృద్ధికే నూతన వ్యవసాయ బిల్లులు

ABN , First Publish Date - 2020-11-07T07:54:40+05:30 IST

రైతుల అభివృద్ధిని దృష్టిలో పె ట్టుకొనే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ బిల్లుల ను ప్రవేశపెట్టిందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు.

రైతుల అభివృద్ధికే నూతన వ్యవసాయ బిల్లులు

 రైతులు, వ్యాపారులు అపోహలను నమ్మొద్దు

 మార్కెట్‌ యార్డులో ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తా  

 అన్నివర్గాల వారికి అందుబాటులో ఉంటా

 నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌


ఖిల్లా, నవంబరు 6: రైతుల అభివృద్ధిని దృష్టిలో పె ట్టుకొనే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ బిల్లుల ను ప్రవేశపెట్టిందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం నిజామా బాద్‌ జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్‌గంజ్‌ మార్కెట్‌ యార్డులో మర్చంట్స్‌ అసోసియేషన్‌ భవనంలో వ్యా పారులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ మార్కెట్‌ యార్డులో రైతుల కు, వ్యాపారులతో పాటు అన్ని వర్గాల కార్మికులకు ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చున ని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయ న హామీ ఇచ్చారు.


కేంద్ర ప్రభుత్వం మార్కెట్‌ యార్డులను తొలగిస్తోందని రైతుల్లో అతిపెద్ద అపోహ ఉందని, నూతన వ్యవసాయ బిల్లుల లో మార్కెట్‌ యార్డులను మూసివేస్తామని ఎక్కడా లేదన్నారు. మార్కెట్‌ యార్డులను మూసివేయడం కేంద్ర ప్రభుత్వానికి అవసర ం లేదన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చునని, దీని ద్వారా రైతు కోరుకున్న మద్దతు ధర లభిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రైతు ముఖ్యమని, దేశ ఆర్థిక వ్యవస్థ 70 శాతం రైతులపైనే ఆధారపడి ఉందని తెలిపారు. రై తులకు మేలు జరిగితేనే మార్కెట్‌ యా ర్డులు అభివృద్ధి చెందుతాయన్నారు. నూతన వ్యవసాయ బిల్లుల వల్ల పారదర్శకత పెరుగుతుందన్నారు. దీని వ ల్ల భారతదేశానికి ప్రపంచ మార్కెట్‌ లో పేరు వస్తుందన్నారు. రైతుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ బిల్లుల వల్ల రైతు పండించిన ఉత్పత్తులకు మద్దతు ధర లభిస్తే రోడ్డెక్కాల్సిన అవసరం ఉం డదన్నారు.


రైతుకు మేలు చేసే చట్టమే కానీ ఎవరినీ మోసం చేసే చట్టం కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ యన పేర్కొన్నారు. అనంతరం నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో పసుపు కొనుగోలు చేసే వ్యాపారులు, మర్చంట్స్‌ అసోసియేషన్‌ స భ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రా నున్న రోజుల్లో పసుపు అమ్మకాలపై తీసుకోవాల్సిన విధి విధానాలపై చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో బీజేపీ నిజామా బాద్‌ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మినర్సయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, మాజీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, మర్చంట్స్‌ అసోసియేసన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేష్‌ ఢాలియా, బచ్చు పురుషోత్తం గుప్త, ఉపాధ్యక్షుడు కమల్‌కిషోర్‌ ఇనాని, వ్యాపారులు మాస్టర్‌ శంకర్‌, గంప శ్రీనివాస్‌, కొత్తపల్లి సంతోష్‌, న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-07T07:54:40+05:30 IST