అక్రమంగా లిక్కర్‌ రవాణా

ABN , First Publish Date - 2020-11-07T07:52:27+05:30 IST

ఉమ్మడి జిల్లా పరిధిలో గట్టి నిఘా లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి మద్యం అక్రమంగా సరాఫరా అవు తోంది.

అక్రమంగా లిక్కర్‌ రవాణా

 రాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘా కరువు

 ఉమ్మడి జిల్లాకు అక్రమంగా రవాణా అవుతున్న ఇతర రాష్ట్రాల మద్యం

 నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్న ఎక్సైజ్‌ శాఖ అధికారులు


నిజామాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లా పరిధిలో గట్టి నిఘా లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి మద్యం అక్రమంగా సరాఫరా అవు తోంది. అనుమతి లేకుండా తయారైన మద్యం బైక్‌ లు, ఆటోలు, కార్ల ద్వారా సరిహద్దులకు వచ్చి చేరు తోంది. అక్కడి నుంచి గ్రామాలు, మండల కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. బెల్ట్‌ షాపులు, ఇతర కేంద్రాలలో అమ్మకాలు చేస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల వద్ద ఎక్సైజ్‌ శాఖ అధికారుల నిఘా తగ్గడంతో మద్యంతో పాటు కల్లు తయారీకి ఉపయోగపడే క్లోరోఫామ్‌, డై జోఫామ్‌లు కూడా ఉమ్మడి జిల్లాకు వచ్చి చేరుతున్నా యి. ఉమ్మడి జిల్లా పరిధిలోని జుక్కల్‌ నుంచి రెంజల్‌ వరకు మహారాష్ట్ర సరిహద్దు ఉంది. ఈ సరిహద్దులోని మద్నూర్‌ మండలం సలాబత్‌పూర్‌, బోధన్‌ మండలం సాలూరా వద్ద సరిహద్దు చెక్‌పోస్టులు ఉన్నాయి. ఈ సరిహద్దు వెంట కోటగిరి మండలం పోతంగల్‌, రెంజ ల్‌ మండలం కందకుర్తి వద్ద సరిహద్దు గుండా వెళ్లేం దుకు బ్రిడ్జిలు ఉన్నాయి. రవాణా ప్రధానంగా వీటి ద్వారానే కొనసాగుతుంది.


జిల్లా ప్రజలకు మహారాష్ట్ర తో సంబంధాలు ఉండడం వల్ల ఎక్కువ వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా సరిహద్దు వద్ద మరి కొన్ని గ్రామాల పరిధిలో పిల్లదారులు ఉన్నాయి. గడిచిన కొన్నేళ్లుగా ఈ పిల్లదారులు మద్యం, కల్లు అక్ర మ రవాణాకు ఉపయోగపడుతున్నాయి. వీటితో పా టు గుట్కా సైతం సరఫరా అవుతోంది. రాష్ట్రంలో సా రా నిషేధం తర్వాత ఎక్కవగా మద్యం, కల్తీ కల్లు ఇత ర రాష్ట్రాల నుంచి సరఫరా అవుతోంది. గత కొన్ని నెల లుగా సుంకం చెల్లించని మద్యం అక్రమంగా సరఫరా అవుతోంది. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌, దెగ్లూర్‌ కేం ద్రంగా ఈ రవాణా జరుగుతోంది. మూడు రోజుల క్రి తం గోవా లేబుల్‌ ఉన్న మద్యంను ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. గోవాలో తయారైనట్టు ఉన్నా..


అదంతా అక్రమంగా తయారు చేసినట్లు అధికారులు భావిస్తు న్నారు. ఆ బాటిళ్ల పైన ధర వంద రూపాయలు అని ఉండడంతో అది నకిలీదని భావిస్తున్నారు. ఇవే కాకుం డా ఇతర లేబుళ్ల పేరుతో కూడా మద్యం అక్రమంగా సరఫరా అవుతున్నట్లు  తెలుస్తోంది. సరిహద్దు గ్రా మాలలో దేశీదారును కూడా అధికారులు పలుమార్లు పట్టుకున్నారు. సరిహద్దులలో ఎక్కువ మద్యం తాగేవా రు దేశీదారుకు తక్కువ ధర ఉండడం వల్ల కూడా కొ నుగోలు చేస్తున్నారు. ఇతర లేబుళ్ల మీద ఉన్నా.. మ ద్యం తక్కువ ధరకు వస్తుండడంతో ఎక్కువ మంది కొ నుగోలు చేస్తున్నారు. ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌, రాష్ట్ర స్థాయి బృందాలు మాత్రమే వీటిని ఎక్కువగా పట్టుకుంటు న్నాయి. ఈ మద్యంవల్ల లాభాలు ఉండడంతో పలువు రు అక్రమార్కులు అధికారుల కళ్లుగప్పి సరఫరా చే స్తున్నారు. కొన్నిచోట్ల చూసీ చూడనట్లు వ్యవహరిస్తుం డడం వల్ల కూడా ఈ అక్రమ రవాణా యథేచ్ఛగా సా గుతోంది. కల్లు దుకాణాలలో వాడే క్లోరోఫామ్‌, డైజోఫా మ్‌ ఇతర రసాయనాలు కూడా సరఫరా అవుతున్నా యి.


వీటిని ఉమ్మడి జిల్లా పరిధిలో కల్లు దుకాణాల వారు ఎక్కువగా ఉపయోగిస్తుండడంతో మహారాష్ట్ర నుంచి అక్రమంగా తెప్పిస్తున్నారు. అవి కల్లు తయా రీలో తప్పనిసరి కావడంతో అక్రమంగా దిగుమతి చే సుకుంటున్నారు. ఎక్సైజ్‌ శాఖ అధికారులు నిత్యం నిఘా పెడితే ఈ అక్రమ రవాణా ఆగనుంది. కొంత మంది అధికారుల సహాయ సహకారాలు ఉండడం వ ల్ల కూడా ఈ దందా కొనసాగుతోంది. మహారాష్ట్ర సరి హద్దులపై నిఘా పెట్టామని జిల్లా ఇన్‌చార్జి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నవీన్‌ చంద్ర తెలిపారు. ఇప్పటికీ పలుమార్లు అక్రమంగా రవాణా అవుతున్న మద్యంను పట్టుకున్నామని ఆయన తెలిపారు. ఆక స్మిక తనిఖీలు కూడా చేస్తామని తెలిపారు.

Updated Date - 2020-11-07T07:52:27+05:30 IST