పూడిక ప్రశ్నార్థకమేనా ?

ABN , First Publish Date - 2020-10-27T11:18:12+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో లక్షలాది ఎకరాలకు సా గునీరు అందించే నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటి సామర్థ్యం ప్ర శ్నార్థకంగా మారుతోంది.

పూడిక ప్రశ్నార్థకమేనా ?

 నిజాంసాగర్‌ ప్రాజెక్టులో పెరుగుతున్న పూడిక

 ఏళ్లు గడుస్తున్నా నీటి నిల్వ సామర్థ్యంపై రాని స్పష్టత

 రోజురోజుకూ తగ్గుతున్న నీటి నిల్వ

 గతంలో రూ.కోట్లు వెచ్చించినా ఫలితం శూన్యమే

 నేటికీ వినియోగించని సిల్టు గేట్లు

 నీటి నిల్వ తగ్గుతుండడంతో వృథాగా పోతున్న వరద నీరునిజాంసాగర్‌, అక్టోబరు 26 : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో లక్షలాది ఎకరాలకు సా గునీరు అందించే నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటి సామర్థ్యం ప్ర శ్నార్థకంగా మారుతోంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి లక్షలాది క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో నిజాంసా గర్‌ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం ఎంత అనేది ఇంజనీ రింగ్‌ అధికారులు సైతం అంచనా వేయలేకపోతున్నట్టు తె లుస్తోంది. 


29.9 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణమైన ప్రాజెక్టు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాను సస్యశ్యామలం చేయడా నికి 1923లో రూ.180 కోట్ల వ్యయంతో ప్రస్తుత కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం అచ్చంపేట గ్రామ సమీపం లో మంజీరా నదిపైన 29.9 టీఎంసీల సామర్థ్యంతో నిజాం సాగర్‌ ప్రాజెక్టును నిర్మాణం చేశారు. లక్షా 75 వేల ఎకరాల కు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టును నిర్మించారు. కాగా, కాల క్రమేణా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటితో పాటు ఇసుక, మట్టి రావడంతో ప్రాజెక్టు నీటిమట్టం తగ్గు తూ వస్తోంది. 1975లో నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటినిల్వ సా మర్థ్యం తగ్గిపోయిందని ప్రభుత్వం ప్రాజెక్టు పురాతన అలు గులను తొలగించి.. రూ.266 కోట్ల వ్యయంతో 20 గేట్ల నిర్మా ణం చేపట్టినా, కేవలం 0.5 టీఎంసీల నీటి నిల్వను మాత్ర మే పెంచగలిచారు. ఈ 20 గేట్ల నిర్మాణంతో నిజాంసాగర్‌ నీటి సామర్థ్యం ఎంత మేరకు పెరిగిందనేది కాగితాలకే పరి మితమైంది.


1932లో ప్రాజెక్టును జాతికి అంకితం చేసినప్ప టికీ అప్పట్లో 29టీఎంసీల నీటి సామర్థ్యం కాగా, 1975 వర కు 15 టీఎంసీల ఇసుక మేట వచ్చి చేరినట్లు 1975లో ఇంజ నీరింగ్‌ అధికారులు అంచనా వేశారు. 1975- 76లో నిజాం సాగర్‌ నీటినిల్వ 18 టీఎం సీలకు పడిపోయిందని అంచనా వే యగా.. 1976 నుంచి ఇప్పటి వర కు 17.802 టీఎంసీలకు తగ్గిన ట్టు తెలుస్తోంది. ఎగువ ప్రాం తాల నుంచి నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఇసుక మేట వ చ్చి చేరుతుండడంతో 2007- 08 సంవత్సరంలో నిజాంసా గర్‌ ఆయకట్టును గట్టెక్కించేం దుకు రూ.262 కోట్ల వ్యయంతో అలీసాగర్‌ ఎత్తిపోతల పథకం, రూ.204 కోట్ల వ్యయంతో రాజారాం గుప్త ఎత్తిపోతల పథకాలను నిర్మించి, 95 వేల ఎకరాలకు శ్రీరాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ నుంచి పంపింగ్‌ ద్వారా నీరు అందిస్తున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు కేవలం లక్షా 31 వేల ఎకరాలకే పరిమిత మైంది. నిజాంసాగర్‌లో 17.802 టీఎంసీల నీటి సామర్థ్యమే ఉందం టూ అధికారులు వీఐపీ సమావేశం అనుగుణంగా నీటిని అందిస్తున్నారు. బోధన్‌, నిజామాబాద్‌ పట్టణాలకు మే, ఏ ప్రిల్‌ మాసాలలో తాగునీటి కోసం నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి 2 టీఎంసీల నీటిని అందిస్తున్నారు. 


ఉపయోగానికి నోచుకోని సిల్టు గేట్లు

నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే ఇసుక మే టను వరద నీటి ద్వారా తొలగించేందుకు 9 సిల్టు గేట్లను ఏర్పాటు చేశారు. కానీ, సిల్టు గేట్లు దాదాపు నిర్మాణ దశ నుంచి ఇప్పటి వరకు ఉప యోగించిన దాఖలాలు లేకపోవడం తో ప్రాజెక్టులో ఇసుక మేట ఏ మేరకు పెరిగిందన్న అంచనా లు కాగితాలకే పరిమితమ య్యాయి. వాస్తవానికి ప్రాజె క్టులో 36 వేల 151 ఎకరాల వైశ్యాలంలో ఇసుక మేట నిం డి ఉందని తెలుస్తోంది. 200 8లో రూ.549 కోట్ల వ్యయంతో నిజాంసాగర్‌ ప్రధాన కాల్వకు 152కి.మీ. మేర ఆధునికీకరణ ప నులు చేపట్టారు. నిర్మాణ దశలో 305 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండే ది. ప్రస్తుతం 1,800 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి కాల్వ ప రిమితమైంది.


నిజాం నవాబులు నిర్మించిన ఈ ప్రాజె క్టు ప్రపంచంలోనే మొట్ట మొదటి బహుళార్థక ప్రాజెక్టు అని ప్ర ఖ్యాతి గాంచినా నీటి నిల్వకు సంబంధించి అధికారులు కాకి లెక్కలు చెబుతున్నారే తప్ప కచ్చితంగా తెలపడం లేదు.  ఈ నెల 15 నుంచి నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి మంజీరా నదిలోకి దాదాపు 6 టీఎంసీల నీటిని విడుదల చేస్తూనే ఉ న్నారు. ఈ నేపథ్యంలో నిజాంసాగర్‌లో ఇసుక మేట వల్లనే నీటి నిల్వలు తగ్గాయా.. నీటి నిల్వల కోసం కోట్ల రూపాయ లు వెచ్చించి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయా.. అనే ది సందేహంగా మారింది. 


ఈ యేడాది 45 టీఎంసీలు మంజీరా పాలు

 ఎగువ ప్రాంతాల నుంచి ఈ యేడాది 45 టీఎంసీల వ రద నీరు నిజాంసాగర్‌లోనికి వచ్చి చేరింది. 28.77 టీఎంసీ ల నీటిని ఈనెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మంజీ రా నదిలోనికి విడుదల చేశారు. నిజాంసాగర్‌ పూర్తి సామ ర్థ్యం నిర్మాణం దశ నుంచి 29 టీఎంసీలు ఉన్నట్లయితే మరో 16 టీఎంసీల నీటిని నిల్వలు నిజాంసాగర్‌ ప్రాజెక్టులో  ఉం డేవని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి యేటా వర్షాలు కురుస్తుండడంతో మంజీరా నది వెంట లక్ష ల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. నాలుగేళ్ల కిందట ప్రా జెక్టు నిండగా, ఈ ఏడు వానాకాలం చివరిలో ప్రాజెక్టు నిండి 45 టీఎంసీల నీరు మంజీరా పాలైంది. 

Updated Date - 2020-10-27T11:18:12+05:30 IST