జోష్‌లేని దసరా

ABN , First Publish Date - 2020-10-27T11:13:08+05:30 IST

దసరా అంటేనే సరికొత్త సందడి.. కొత్త బట్టలు, పిండి వం టలు.. కుటుంబ సభ్యులు ఒక్కచోట చేరి ఆ జోష్‌ వేరే ఉంటు ంది. కానీ ఈ సంవత్సరం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఆ ఉత్తేజం ఎక్కడా కనిపించడం లేదు.

జోష్‌లేని దసరా

 అలాయ్‌.. బలాయ్‌లు అంతంతమాత్రమే

 చాలా చోట్ల ఉత్సాహంగా కనిపించని వేడుకలు

 కరోనాతో బోసిపోయిన వ్యాపారాలు

 మందగించిన కొనుగోళ్లు

 ఉమ్మడి జిల్లాలో కనిపించని పండుగ వాతావరణం

 పంటలు దెబ్బతిని డీలా పడిన రైతాంగం


కామారెడ్డి, అక్టోబరు 26: 

దసరా అంటేనే సరికొత్త సందడి.. కొత్త బట్టలు, పిండి వం టలు.. కుటుంబ సభ్యులు ఒక్కచోట చేరి ఆ జోష్‌ వేరే ఉంటు ంది. కానీ ఈ సంవత్సరం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఆ ఉత్తేజం ఎక్కడా కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కార ణం కరోనా. ఈ మహమ్మరి కారణంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం ముఖ్యమైన అంశం. అయితే, ఉమ్మడి జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి కొంత భిన్నంగా ఉండగా, గ్రామాల్లో మా త్రం ఎక్కడా సందడి కనిపించలేదు. ఈ సారి పండుగకు ప్ర ధానంగా దెబ్బతిన్నది వ్యాపార రంగం. ఈ సారి పండుగ వా తావరణమే కనిపించలేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. వ స్త్ర వ్యాపారంతో పాటు బంగారం వ్యాపారం సైతం డీలా పడి ంది. కొనుగోలుదారులు లేక వస్త్ర దుకాణాలు అంతంతమా త్రంగానే నడిచాయి. బంగారం, ఇతర దుకాణాలు సైతం అ లాగే ఉన్నాయి. కేవలం కిరాణ దుకాణాలు మాత్రం కొంత రద్దీగా కనిపించాయి.


 బస్సుల్లో మాత్రమే కనిపించిన రద్దీ

పండుగకు మూడు రోజుల ముందు నుంచి ప్రయాణాలు మొదలయ్యాయి. దూర ప్రాంతాల్లో ఉంటున్న వారు స్వస్థలా లకు రావడం కనిపించింది. హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారితో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ కనిపించింది. అలాగే, ఆటోలు కూడా బాగానే నడిచాయి. అయినా చాలా వ రకూ ప్రజలు సొంత వాహనాల్లోనే ప్రయాణించేందుకు మొ గ్గు చూపారు. కాగా, తెలంగాణలో దసరా ముఖ్యమైన పండు గ అయినా ఆర్టీసీ పెద్ద సంఖ్యలో స్పెషల్‌ సర్వీసులు నడ పలేదు. ఈ లెక్క ప్రకారం ఆర్టీసీకి దసరా గిరాకీ అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది.


 ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు

గత వారంరోజులుగా ఉమ్మడి జిల్లాలో నిత్యావసర వస్తువు ల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ముఖ్యంగా కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. మార్కెట్‌లో ఏ రకం కూరగాయలు చూసినా రూ.80 నుంచి రూ.100 వరకూ విక్రయిస్తున్నారు. దీంతో పాటు ఉల్లిగడ్డల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వీ టితో పాటు మార్కెట్‌లో నిత్యావసర వస్తువులు, పప్పుదినుసు ల ధరలు సైతం పెరిగాయి. పెరిగిన ధరలతో సామాన్య, మ ధ్య తరగతి ప్రజలు కొనలేని పరిస్థితి ఉందని పేర్కొంటు న్నారు. పెరిగిన ధరల మూలంగా పండుగను సాదాసీదాగా జరుపుకొన్నట్లు పలువురు పేర్కొన్నారు.


 అకాల వర్షాలతో రైతన్న డీలా

ఈ సారి రైతన్నలు ఎన్నడూ లేని విధంగా డీలా పడ్డారు.  దసరా పండుగకు వారు పండించిన ధాన్యపుసిరులు ఇంటికి చేరే సమయం కావడంతో ఇంటిల్లిపాది ఆనందాలతో పండు గను జరుపుకొనే సమయం ఇది. కానీ ఈ సంవత్సరం అకాల వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరిపైరు మొత్తం నేలవాలింది. చాలా వరకు పొలాల్లో వర్షపు నీరు నిలిచింది. వరుస వర్షాలతో పత్తి నల్లబారిపోయింది. కాయలు దెబ్బతి న్నాయి. వరి పంటకు దోమపోటు వల్ల పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని కామారెడ్డి జిల్లాలోని పలుచోట్ల పంటల ను తగులబెట్టిన పరిస్థితులు ఏర్పడుతుండడంతో ఉన్న డబ్బు లు మొత్తం పెట్టుబడుల రూపంలో పెట్టారు. ప్రస్తుతం రైతు ల చేతిలో డబ్బులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో గ్రా మాల్లో దసరా పండుగ ఉత్సాహం అంతంతమాత్రంగానే కని పించింది.


 దెబ్బతీసిన కరోనా

ఈ అన్ని రంగాలను కరోనా దెబ్బతిసింది. కరోనా ఉధృతి తగ్గుతూ వస్తున్నా ఇంకా ప్రభావం మాత్రం పోలేదు. ఉమ్మడి జిల్లాలో వేల సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ సమయంలో అంతంతమాత్రంగానే ఉన్న కేసులు ఆగస్టు, సె ప్టెంబరులో మాత్రం ఉధృతమవయ్యాయి. ప్రస్తుతం తక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నా ఇంకా పూర్తిస్థాయిలో తగ్గలేదు. అయితే కరోనాతో దాదాపు మూడు, నాలుగు నెలల పాటు పనులు లేకుండా పోయాయి. దీంతో ప్రజలలో కొనుగోలు శక్తి తగ్గింది.


 కామారెడ్డిలో దసరా ఉత్సవాలు రద్దు

కామారెడ్డి జిల్లాలో ఏటా దసరా పండుగను పురస్కరించు కుని పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రావణాసుర ద హనంతో పాటు లేజర్‌షో నిర్వహిస్తుంటారు. అయితే ఈ సా రి కరోనా ప్రభావంతో వేడుకలను రద్దు చేశారు. జిల్లా కేంద్రం లోని ధర్మశాల ప్రాంతంలో ప్రతి ఏడాది పెద్ద ఎత్తున్న ప్రజ లు జంబీ ఆకులు తీసుకుని రావడానికి వెళ్లి వచ్చి అలాయ్‌.. బలయ్‌లు చేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకునే వారు. కానీ ఈ సంవత్సరం ఆ పద్ధతి అంతంతమాత్రంగానే కనిపించింది.

Updated Date - 2020-10-27T11:13:08+05:30 IST