అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-10-08T11:12:48+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గ్రామాల్లోని అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ లత సూచించారు.

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

 అదనపు కలెక్టర్‌ లత


డిచ్‌పల్లి, ఆక్టోబరు 7:  తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గ్రామాల్లోని అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ లత సూచించారు. మండలంలోని నడిపల్లిలో ఎల్‌ఆర్‌ఎస్‌ సర్వేతో పాటు పల్లె ప్రకృతి వనాలు పరిశీలించి ఎంపీడీవో సురేందర్‌, ఎంపీవో రామకృష్ణకు పలు సూచనాలు చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ సర్వే పకడ్బందీగా చేపట్టాలని, ఎలాంటి తప్పిదాలు జరగకుండా చొరవచూపాలన్నారు. గుడిసె స్థలాలకు పంచాయతీ నెంబర్లు కేటాంచాలని ఆమె సూచించారు.


ధర్మారం (బి) గ్రామంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌ పల్లె ప్రకృతి వనాలు పరిశీలించి పంచాయతీ సిబ్బంది అభినందించారు. గ్రామంలో ఎల్‌ఆర్‌ఎస్‌ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ఆయన వెంట పంచాయతీ సిబ్బంది ఉన్నారు.


 రెండు రోజుల్లో ఇళ్ల నమోదు వివరాలను పూర్తి చేయాలి

సిరికొండ: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాను సారం గ్రామాల్లో ఇళ్ల నమోదు ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ లత పచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. సిరికొండ మండలం గోప్యనాయ క్‌ తండా, కొండపూర్‌, గోప్య తండా, గడ్కోల్‌, రామడుగు, సిరికొండ గ్రామాల్లో ఇంటింటి సర్వేను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సర్వే పనులను వేగవంతం చేయాల న్నారు.


ఇళ్ల నమోదు, కొలతల విషయంలో ఎలాంటి తేడాలు రావొద్దని తెలిపారు. పెద్ద గ్రామాల్లో, ఇళ్ల నమోదు ప్రక్రియ ఆలస్యంగా జరుగుతు న్న గ్రామాల్లో అదనపు సిబ్బందిని నియమించుకొని రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఎంపీడీవో లక్ష్మణ్‌కు, కార్యదర్శులకు సూచించారు. 

Updated Date - 2020-10-08T11:12:48+05:30 IST