సమగ్ర భూ సర్వే

ABN , First Publish Date - 2020-03-13T12:07:54+05:30 IST

సమగ్ర భూ సర్వే

సమగ్ర భూ సర్వే

క్షేత్రస్థాయిలో భూ వివరాలు సేకరిస్తున్న ఏఈవోలు

ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదుకు చర్యలు

జిల్లాలో 1.50 లక్షల హెక్టార్ల సాగు భూమి

ప్రస్తుతం రబీలో సాగు 86.141 హెక్టార్లు

22 మండలాల్లో 2,32,506 మంది వివరాలు సేకరించనున్న అధికారులు


కామారెడ్డి, మార్చి 12 : వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సాగు భూములపై సమగ్ర సర్వే కొనసాగుతోంది. జిల్లాలోని 100 క్లస్టర్ల పరిధి లో ఉన్న ఏఈఓలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వ్యవసాయ భూములు, పంటలకు సంబంధిం చిన సమగ్ర వివరాలను సేకరిస్తున్నారు. రబీ లో జిల్లాలో సాగు విస్తీర్ణం, బీడుగా ఉన్న భూమి ఎంత అనే సమాచారం సేకరించే ప నిలో నిమగ్నమయ్యారు. పట్టాదారు పాస్‌ పు స్తకాల్లోని సర్వే నంబర్ల ఆధారంగా సర్వే చే స్తున్నారు. సేకరించిన వివరాలను ఎప్పటిక ప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. గతే డాది కూడా అధికారులు పంటల వివరాల సే కరణపై సర్వే చేశారు. రబీలో ప్రధానంగా జి ల్లాలో వరి, వేరుశనగ, మొక్కజొన్నపంటలను ఎక్కువగా సాగు చేశారు. పూర్తిస్థాయిలో పం టల వివరాలను సేకరించి వారికి మెరుగైన మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.


ఇదీ ఉద్దేశం..

జిల్లాలోని 22 మండలాల పరిధిలోని గ్రా మాల్లో 2,32,506 మంది రైతులకు సంబంధిం చిన సర్వే నెంబర్లలో పంటలను పట్టాదారు పుస్తకాల ఆధారంగా సర్వే నిర్వహిస్తున్నారు. రబీలో వేసిన పంటల వివరాలను పూర్తిస్థా యిలో సేకరించి పంటల వారిగా దిగుబడిని అంచనా వేసి భవిష్యత్‌లో కొనుగోలు కేంద్రాల ను ఏర్పాటు చేసేందుకు సర్వేకు శ్రీకారం చు ట్టారు. పట్టాదారు పాస్‌ పుస్తకాల్లోని సర్వే నె ంబర్ల ప్రకారం ఏఈఓలు సర్వే చేస్తున్నారు. గ్రామం, యూనిట్‌గా తీసుకొని ముందస్తుగా రైతులతో చర్చించి క్షేత్రస్థాయికి వెళ్లి సాగు వి స్తీర్ణాన్ని నిర్దేరించేందుకు వివరాలు సేకరిస్తు న్నారు. సర్వే నెంబర్ల వారీగా ఎంత సాగు చే స్తున్నారు. ఎంత భూమి సాగు చేయకుండా నిరుపయోగంగా ఉందనే వివరాలను సేకరి స్తున్నారు. గ్రామాల వారీగా పరిశీలిస్తే... మొ త్తం సాగులో ఉన్న భూమి, బీడు భూమి, ప ంటల నష్టం, పంటలు ప్రస్తుతం ఏ దశలో ఉ న్నాయి వంటి సమగ్ర వివరాలను రికార్డు చే స్తున్నారు. అదే విధంగా జిల్లాలో దిగుబడికి అనుగుణంగా ఎన్ని ధాన్యం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేయాలి. రైతులకు గిట్టుబాటు ధర ఎంత కల్పించాలి తదితర అంశాలను అ ంచనా వేయడానికి వ్యవసాయశాఖధికారులు  ఈ సర్వేను నిర్వహిస్తున్నారు.


రబీలో 86.141 హెక్టార్ల సాగు

జిల్లాలో ప్రస్తుతం రబీ సాధారణ సాగు వి స్తీర్ణం 1.50 హెక్టార్లు కాగా నిజాంసాగర్‌ ప్రా జెక్ట్‌ కింద వరి పంట పోలాల సాగుతో పాటు వ్యవసాయానికి నిరంతరంగా 24 గంటల వి ద్యుత్‌ సరఫరా చేయ వంటి కారణం వల్ల సా గు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో రబీ కింద అ ధికారులు 24,286 హెక్టార్లు అంచనా వేయగా అందుకు భిన్నంగా 54,205 హెక్టార్లలో వరిని సాగు చేశారు. మొక్కజొన్న పంటను నార్మల్‌ ఏరియాలో 11,630 హెక్టార్లలో సాగ వుతుం దని వ్యవసాయధికారులు అంచనా వే యగా 10,907 హెక్టార్లలో మాత్రమే మొక్క జొన్నను రైతులు సాగు చేస్తున్నారు. శనగపంట 15, 047 హెక్టార్లలో సాగవుతుందని అంచనా వే యగా 18,635 హెక్టార్లలో శనగపంటను రైతు లు సాగు చేస్తున్నారు. పెసర, మినుము, ఉల వలు 600 హెక్టార్లలో సాగవుతుందని అం చనా వేయగా 400 హెక్టార్లలో సాగవుతున్నా యి. చెరుకు పంట 4312 హెక్టార్లలో సాగవు తుందని అంచనా వేయగా 2542 హెక్టార్లలో చెరుకు పంట సాగువుతోంది.


ఆన్‌లైన్‌లో నమోదు..

పంటలకు సంబంధించిన సమగ్ర వివరా లు సేకరించిన అనంతరం ఏఈఓలు సాగు వివరాలను ఏ రోజుకారోజు ఆన్‌లైన్‌లో రైతు బంధు ఫోల్డర్‌లో నమోదు చేస్తున్నారు. సర్వే నెంబర్ల ప్రకారంగా సాగు భూమి, సాగు చే యని భూమి వివరాలను రైతుబంధు పో ర్టల్‌లో ఆన్‌లైన్‌ చేస్తున్నారు. గ్రామాల వారీగా రైతుల వివరాలతో పాటు, ఏయే పంటలు సాగు చేస్తున్నారనే వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లాలోని 22 మండలాల పరి ధిలో 526 గ్రామాల్లో 2,32,506 మంది రైతు లున్నారు. ఆన్‌లైన్‌లో గ్రామాల వారీగా భూ మి ఎంత ఉంది అందులో సాగుభూమి ఎంత ఉంది. ప్రస్తుత పంటల విస్తీర్ణం, సాగుకు యో గ్యం కాని భూమి వివరాలు తెలుస్తాయి. స ర్వే ద్వారా భవిష్యత్‌లో సాగుకు అవసర మయ్యే ఎరువులు, విత్తనాలు, ఏమేరకు  అవసరం అవుతాయనే అంచానా వేయ డానికి వీలు కలుగుతుంది. అదే విధం గా గ్రామాల వారీగా చిన్న, సన్నకారు, పెద్ద రైతుల వివరాలు, పంటల నష్టం వివరాలు స మగ్రంగా తెలుస్తాయని వ్యవసాయధికారులు చెబుతున్నారు.


నెలాఖరులోగా పూర్తి చేస్తాం- నాగేంద్రయ్య, జేడీఏ, కామారెడ్డి

క్షేత్రస్థాయిలో ఏఈఓలు, పంటల సాగుపై సర్వే చేస్తున్నారు. దాదాపుగా చివరి దశకు వచ్చింది. సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తాం. సర్వే నెంబర్ల వారీగా ప్రస్తుతం రైతులు వేసిన పంటల వివరాలు సేకరించి, పంటల వారీగా వచ్చే దిగుబడిని అంచనా వేసి భవిష్యత్‌లో చేసేందుకు చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2020-03-13T12:07:54+05:30 IST