రుణమాఫీపై ఉత్కంఠ!

ABN , First Publish Date - 2020-03-13T12:06:41+05:30 IST

రుణమాఫీపై ఉత్కంఠ!

రుణమాఫీపై ఉత్కంఠ!

ప్రభుత్వం నిధులు కేటాయించినా జారీ చేయని మార్గదర్శకాలు

రుణమాఫీ దిశగా యంత్రాంగం కసరత్తు

26 అంశాల వారీగా రైతుల సమాచార సేకరణ

15లోపు వివరాల సమర్పణకు బ్యాంకర్ల కసరత్తు

జిల్లా వ్యాప్తంగా లక్ష మంది రైతులు అర్హులు

జిల్లాలో రూ.100 కోట్లు మాఫీ అయ్యే అవకాశం


కామారెడ్డి, మార్చి12 (ఆంధ్రజ్యోతి) : పంటల సాగుపై బ్యాంక్‌ల నుంచి రైతులు తీసుకున్న రుణమాఫీపై తర్జనభర్జన నెల కొంటోంది. రుణమాఫీకై రాష్ట్ర ప్రభుత్వం ని ధులు కేటాయించినప్పటికీ స్పష్టమైన మా ర్గనిర్దేశకాలు జారీ చేయకపోవడంతో ఇటు సంబంధిత శాఖాధికారుల్లోనే కాకుండా అ న్నదాతల్లోనూ.. అయోమయం నెలకొంది. రుణమాఫీకై అర్హులైన రైతుల వివరాలు సే కరించి సమర్పించాలని ప్రభుత్వం వ్యవసా య, బ్యాంకర్లకు ఆదేశించించడంతో ఆ రెం డు శాఖల అధికారులు వివరాల సేకరణ లో నిమగ్నం అయ్యారు. కానీ సంబంధిత శాఖధికారుల వద్ద ఎంత మంది రుణమా ఫీకి రైతులు అర్హులు. ఎంతమేర రుణాలు మాఫీ అవుతాయి అనే లెక్కలు లేకపోయా యి. రుణమాఫీ అమలవుతే జిల్లాలో సు మారు లక్ష మంది రైతులు ల బ్ధిపొందుతారని రూ.100 కో ట్ల వరకు మాఫీ అయ్యే అవకాశాలు ఉన్నా యని తెలుస్తోంది.


అందని మార్గదర్శకాలు..

పంట రుణ మాఫీ మార్గదర్శకా లపై ఉత్కంఠ నెలకొంది. జి ల్లాలో లక్షలోపు రుణాలను నాలుగు విడు తల్లో మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటిం చిన విషయం తెలిసిందే. 2018 డిసెంబర్‌ 11 లోపు పంట రుణాలు తీసుకున్న రైతు లకే మాఫీ వర్తిస్తుందని గతంలో ప్రకటిం చింది. అయితే ప్రస్తుతం ఇదే కటాఫ్‌ తేది ని అమలు చేస్తారా? లేదంటే మరో కటాఫ్‌ ను ప్రకటిస్తారా అనే అవంశంపై ఎవరికీ స్పష్టత లేదు. అలాగే బంగారం తాకట్టు పె ట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలకు మాఫీ వర్తిస్తుందా? లేదా అనేది తేలాల్సి ఉంది. ఇ టు వ్యవసాయశాఖధికారులు, అటు బ్యాం కర్లు దేనికి సమాధానం చెప్పలేకపోతున్నా రు. రూ.25వేల లోపు రుణం తీసుకున్న రై తులకు ఒకే దఫాలో మాఫీ జరుగనుంది. ఈ లెక్కన జిల్లాలో 15 నుంచి 25వేల మంది వరకు రైతులు ఉంటారని అం చనా. మిగిలిన వారికి ఆయా రుణాల మొత్తాన్ని బట్టి మాఫీ చేసేందుకు సమాయత్తం అవు తున్నారు. టీఆర్‌ ఎస్‌ అధికారంలోకి వచ్చిన తొలిసారి నే రుగా రైతుల ఖాతా లో జమ చేశారు. ఈ సారి రైతులకు చెక్కు ల రూపంలో మాఫీ సొమ్ము ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తం మీద ప్రభుత్వం నుంచి రుణమాఫీకి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉంది. 

వీటికోసం రైతులు, బ్యాంకర్లు ఎదురు చూస్తున్నారు.


లక్ష మంది రైతులకు మాఫీ అయ్యే అవకాశం..

రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలను మా ఫీ చేస్తే జిల్లాలో సుమారు లక్షామంది రైతులకు రుణాలు మాఫీ అయ్యే అ వకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పం ట రుణమాఫీపై గతంలోనే ప్రభు త్వం కటాఫ్‌ తేదీని ప్రకటించిన విష యం తెలిసిందే. 2018 డిసెంబర్‌లోపు పంట రుణాలు తీసుకున్న వారికే రుణ మాఫీ వర్తిస్తుందని ప్రకటించింది. ఈ లెక్కన 2018 డిసెంబర్‌ వరకు జిల్లా లో 2,30,00 మంది రైతులు రూ.1800 పంట రుణాలను తీసు కున్నారు. ఇందులో లక్షలోపు రు ణాలు తీసుకున్నవారు సుమారు లక్షమంది రైతులు ఉంటారని బ్యాంకర్లు చెబుతున్నారు. అనగా రూ.వందకోట్ల వరకు రుణమాఫీ అ య్యే అవకాశం ఉంది. ఇందులో రూ. 25 వేల వరకు రుణాలు తీసుకున్న రై తులు సుమారు 15 నుంచి 25 వేల మం ది రైతులు ఉంటారని వీరందరికీ ఏకకా లంలో సుమారు రూ.20 కోట్ల వరకు మా ఫీ అయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత శాఖధికారులు పేర్కొంటున్నారు.


సేకరిస్తున్న వివరాలు..

జిల్లాలో పంట రుణాల కింద అప్పు తీ సుకున్న ప్రతి రైతుకు సంబంధించి 26 అం శాల సమాచారాన్ని సేకరిస్తున్నారు. రైతుపే రు తీసుకున్న రుణం, తేది, ఆధార్‌కార్డు నెంబర్‌, మొబైల్‌ నెంబర్‌, పట్టాపాస్‌ పుస్త కం ఖాతా సంఖ్య, అసలు, వడ్డీ కలిపి చె ల్లించాల్సిన మొత్తం ఇలా 26 అంశాల వివ రాలు సేకరిస్తున్నారు. రైతుల వారీగా ఈ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో బ్యాంక్‌లో నమో దు చేస్తున్నారు. గడువులోగా జాబితా సేక రించేందుకు బ్యాంకర్లు వేగం పెంచారు.


త్వరలో ఫలించనున్న నిరీక్షణ..

ఎట్టకేలకు కర్షకుల నిరీక్షణ ఫలించనుం ది. రైతుల పంట రుణమాఫీ హమీని నిల బెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడి గా అడుగులు వేస్తుండటం ఇందుకు బలా న్ని చేకూర్చుతోంది. ఈ మేరకు ప్రభుత్వం బడ్జెట్‌లో రుణమాఫీకోసం నిధులు కేటాయి ంచిన విషయం తెలిసిందే. రూ. లక్షలోపు పంట రుణానికి సంబంధించి నాలుగు విడ తల్లో నిధులు మంజూరు చేస్తానని ప్రభు త్వం ప్రకటించింది. రూ.25 వేలు తీసుకు న్న రుణాలను ఏకకాలంలో మాఫీ చేయా లని నిర్ణయించింది. జాబితాను రూపొందిం చే పనిలో బ్యాంకర్లు నిమగ్నమయ్యారు.

Updated Date - 2020-03-13T12:06:41+05:30 IST