ఇరిగేషన్ భూమి అన్యాక్రాంతం!
ABN , First Publish Date - 2020-03-13T12:05:40+05:30 IST
ఇరిగేషన్ భూమి అన్యాక్రాంతం!

పెర్కిట్ శివారులో నిజాంసాగర్ కెనాల్ భూమి యథేచ్ఛగా కబ్జా
పరాధీనం అవుతున్న రూ.12 కోట్ల విలువైన భూమి
ఫిర్యాదు చేసినా పట్టించుకోని సంబంధిత శాఖల అధికారులు
ఆర్మూర్, మార్చి 12 : ఇరిగేషన్ భూ ములు గుర్తించాలని ప్రభుత్వం ఒక వైపు ఆదేశాలివ్వగా, మరో వైపు రూ.12కోట్ల వి లువైన భూమి క్రయవిక్రయాలు జరుగు తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శి వారులో కరీంనగర్ మార్గంలో నిజాంసా గర్ కెనాల్ భూమిని కబ్జా చేసి విక్రయి స్తున్నారు. కరీంనగర్ మార్గంలో ఎడమ వైపున గతంలో నిజాంసాగర్ కెనాల్ డిస్టి బ్యూటరీ 82/2/1 ప్రవహించేది. నిజాం సాగర్‌లో నీరు పుష్కలంగా ఉన్న సమ యంలో ఈ కాలువ ద్వారా ఇక్కడి భూ ములకు సాగు నీరందేది. నిజాంసాగర్‌లో నీరు లేకపోవడం, చివరి ఆయకట్టుకు నీ రు రావడంలేదు. అంతేగాక ఈ ప్రాంతం లో ఇళ్లు నిర్మించడంతో పట్టణంలో కలిసి పోయింది. దీంతో కెనాల్ నామరూపాలు లేకుండా పూడిపోయింది. ఈ భూమిపై రియల్ వ్యాపారులు కన్నెసి వేరే సర్వేనెం బర్‌లు వేసి క్రయవిక్రయాలు జరుపుతు న్నారు. 63వ నెంబర్ జాతీయరహదారిని ఆనుకుని ఉండడం వల్ల గజం ధర రూ .40వేలు పలుకుతోంది. మొత్తం సుమారు రూ.12కోట్ల విలువైన భూమి ఆక్రమణకు గురైంది. కరీంనగర్ రోడ్డు గతంలో జిల్లా పరిషత్ రోడ్డుగా ఉండేది. నక్షాలో జడ్పీ రోడ్డుగానే ఉంది. అప్పట్లో ఇరువైపుల 33 అడుగుల రోడ్డు ఉండేది. 30ఏళ్ల క్రితం ఈ రోడ్డు జాతీయరహదారిగా అవతరిం చింది. నిజామాబాద్ నుంచి జగదల్‌పూర్ వరకు జాతీయరహదారిగా కేంద్ర ప్రభు త్వం ప్రకటించింది. సింగల్ రోడ్డుగా ఉన్న దీనిని డబుల్ రోడ్డుగా మార్చారు. 33అ డుగుల నుంచి 50అడుగులకు విస్తరించా రు. విస్తరణలో ఇరువైపుల భూమి రోడ్డు లో కలిసిపోయింది. విస్తరణలో పోయిన భూమికి సంబంధించి సర్వేనెంబర్‌లు వే సి క్రయవిక్రయాలు జరుపుతున్నారు. ఇ ప్పటికే కొన్ని పక్కా భవనాలు కూడా వెలి శాయి. ఈ ఆక్రమణ వెనుక కొందరు ప్ర భుత్వోద్యోగుల సహకారం ఉందనే ఆరోప ణలు వినిపిస్తున్నాయి.
ఫిర్యాదు చేసినా ఫలితం లేదు..
ఇరిగేషన్ భూమి ఆక్రమణ విషయమై వివిధ శాఖల అధికారులకు ఫిర్యాదు చే సినా పట్టించుకోకపోవడం లేదు. ఆర్మూర్ కు చెందిన సడాక్ ప్రమోదు ప్రజావాణి లో కలెక్టర్‌కు, ఆర్డీవోకు, తహసీల్దార్‌కు, ఇ రిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు దీనిపై అధికారులు స్పంది ంచలేదు. ఫిబ్రవరి 27న సర్వే చేస్తామని రెవెన్యూ అధికారులు 18వ తేదీన నోటీసు జారీ చేశారు. సర్వేకు వచ్చిన తర్వాత ఇ రిగేషన్ ఏఈ తనకు పట్టణ ప్రగతి ఉం దని ఇప్పుడు వద్దంటు వెళ్ళిపోయాడు. మళ్ళీ 11న సర్వే చేయాల్సి ఉండగా ఎవ రు రాలేదు. అధికారులు సర్వేకు రాకపోవ డం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులు సర్వే చేసి విలువైన భూమి కాపాడాలని కోరుతున్నారు.
జాయింట్ సర్వేకు రాశాం : కృష్ణమూర్తి, డీఈ
కరీంనగర్ రోడ్డులో ఇరిగేషన్‌కు సంబంధించి కెనాల్ భూమి విషయంలో జాయింట్ సర్వేకు రాశాం. రెవెన్యూ వారు సర్వే చేయాల్సి ఉంది. 30ఏళ్లుగా నిజాంసాగర్ నీరు రావడంలేదు.