మార్కెట్‌ యార్డ్‌కు పచ్చతోరణం!

ABN , First Publish Date - 2020-03-13T12:04:52+05:30 IST

మార్కెట్‌ యార్డ్‌కు పచ్చతోరణం!

మార్కెట్‌ యార్డ్‌కు పచ్చతోరణం!

మార్కెట్‌కు పోటెత్తిన పసుపు

ఒకేరోజు 53 వేల బస్తాల రాక

అయినా పెరగని పసుపు ధర 

క్వింటాలు రూ.4 వేల నుంచి రూ.6,200 మధ్య పలికిన ధర

ఈ-నామ్‌ ఉన్నా పెరగని రేటు


నిజామాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నిజామాబాద్‌ వ్యవసాయ మా ర్కెట్‌కు పసుపు  పోటెత్తింది. ఈ సీజన్‌లోనే అత్యధికంగా గురువారం పసుపు మార్కెట్‌కు తరలివచ్చింది. వరుస సెలవులు కావడంతో రైతులు భారీగా పసుపును మార్కెట్‌కు తీసు కువచ్చారు. మార్కెట్‌కు జిల్లాతోపాటు నిర్మల్‌, జగిత్యాల జిల్లాల నుంచి భారీగా పసుపును రైతులు తీసుకు వచ్చినా ధర మాత్రం పెరుగ లేదు. నాణ్యమైన పసుపుకు కూడా క్వింటాలు ఆరువేలకు మించి ధర పలకడం లేదు. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పసుపును పటిటంచు కోకపోవడం వల్ల ఈ సీజన్‌లో ధరలు బాగా తగ్గాయని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం వచ్చే ధరల వల్ల పెట్టుబడికి కూడా సరిపో యే డబ్బులు రావడం లేదని రైతులు తెలిపా రు. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు  ఈ సీజన్‌లోనే అత్యధికంగా 53వేల బస్తాల పసుపు రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చారు. వరుసగా నాలుగు రోజులు మార్కెట్‌కు సెల వులు రావడం వల్ల కొనుగోలు నిలిచిపోయా యి. గురువారం మార్కెట్‌ తెరువడంతో జి ల్లాలోని రైతులతో పాటు నిర్మల్‌, జగిత్యాల జి ల్లాల నుంచి రైతులు ఎక్కువగా తీసుకువచ్చా రు. నిజామాబాద్‌ మార్కెట్‌లో భారీగా పసు పు వచ్చిన అమ్మకాలు మాత్రం క్వింటాలు 4 వేల నుంచి 6200 రూపాయల మధ్యనే జరి గాయి. కర్చుమిన్‌ శాతం అధికంగా ఉన్న పసుపుతో పాటు ఎండిన కాడి, గోళ రకాన్ని ఎక్కువగా రైతులు తెచ్చినా ధర పెరుగలేదు. మోడల్‌ రేటు ఎక్కువగా క్వింటాలు 4500 రూపాయల నుంచి 5350 మధ్యనే ఎక్కువగా జరిగాయి. కొద్దిమంది రైతులకు మాత్రమే క్వింటాలు 6వేల వరకు ధర పలికింది. ఈ సీజన్‌లో ఇంత పసుపు ఎప్పుడు రాలేదు. జనవరి నుంచి ఈ రరోజు వరకు ప్రతిరోరజు 15 నుంచి 30వేల బస్తాల మధ్యనే బస్తాలు వచ్చాయి. మొదటిసారిగా ఎక్కువ బస్తాలు ఈ సీజన్‌లో రావడంతో అందరి రైతులవి కొనుగోలు చేసే విధంగా మార్కెటిగ్‌ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. రైతులు తీసు కువచ్చిన పసుపుకు ధరలు నిర్ణయించడంతో పాటు కొనుగోలు చేసే విధంగా చూశారు. 


ఈయేడు తగ్గిన దిగుబడి..

జిల్లాలో ఈయేడాది 50వేల ఎకరాల వర కు పసుపుసాగు చేశారు. వరుస వర్షాలతో ది గుబడి బాగా తగ్గింది. వర్షాలు భారీగా రావ డంతో పసుపునకు తెగుళ్లుసోకి గత సంవ త్సరం లాగా పసుపు దిగుబడి రాలేదు. గత సంవత్సరం ప్రతి రైతుకు 15 నుంచి 25 క్విం టాళ్ల వరకు దిగుబడి రాగా ఈ సంవత్సరం మాత్రం 10 నుంచి 20 మధ్యనే వస్తోంది. పెట్టుబడి, కూలీలు పెరగడం వల్ల రైతులకు గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. గత సంవత్సరం లాగా ధరలు లేకపోవడం వల్ల నష్టం వస్తోందని వారు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని పసు పు రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


ఈ-నామ్‌ ఉన్నా పెరగని ధర..

నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో ఈ-నామ్‌ను ప్రవేశపెట్టినా ధరలు మాత్రం పెరగడం లేదు. ఈ మార్కెట్ల పేరున కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఈనామ్‌ను ప్రవేశ పెట్టింది. ఈ-నామ్‌ ద్వారానే అంతా ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. రైతులకు స మాచారం అందిస్తున్నారు. అయినా ఫలితం మాత్రం రావడం లేదు. ఈ మార్కెట్‌ను రా ష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల మార్కెట్లతో అనుసంధానం చేయకపోవడం వల్ల రైతు లకు ఎక్కువగా ప్రయోజనం ఉండటం లేదు. ఈ-నామ్‌ ద్వారా రైతులకు లాట్‌ నెంబర్లు  ఇవ్వడం, ధరల సమాచారం అందిస్తున్నారు. మార్కెట్‌లో ఆన్‌లైన్‌లో అనుసంధానం చేస్తు న్నారు. ఇతర మార్కెట్లతో అనుసంధానం లేక పోవడం వల్ల అక్కడి వ్యాపారులు కొను గోలుకు ముందుకు రావడం లేదు. మహా రాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల మార్కెటింగ్‌ శా ఖ అధికారులతో చర్చలు జరుపుతున్నా ఇప్ప టికి మాత్రం కొలిక్కి రాలేదు. ఈ-నామ్‌ ఉ న్నా పసుపునకు మాత్రం ధర రావడం లేదు. 


డైరెక్ట్‌ పర్చేజ్‌ సెంటర్‌ ఏర్పాటు..

పసుపు రైతులను ఆదుకునేందుకు మా ర్కెట్‌లో డైరెక్టు పర్చేజ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి పసుపును తీసుకు వచ్చే రైతులకు నేరుగానే వ్యాపారులు కొను గులు చేస్తారు. కమీషన్‌ ఏజెంట్లు ఉండరు. పసుపు అమ్మగానే రైతుల ఖాతాల్లో డబ్బు లను జమచేస్తారు. డైరెక్ట్‌ పర్చేజ్‌ కేంద్రంలో పసుపు అమ్మే రైతులకు కమీషన్‌ కట్‌ చేయడం లేదు. 

ఎలాంటి ఖర్చులు లేకుండా డబ్బులు ఖా తాలో జమచేస్తున్నారు. వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లతో సంబంధం లేని రైతులు ఈ కేంద్రాలకు తీసుకువచ్చి అమ్మకాలను చేస్తున్నారు.


ధర వచ్చే విధంగా చూస్తున్నాం..- స్వరూపరాణి, మార్కెట్‌ కార్యదర్శి

మార్కెట్‌కు వచ్చే పనసుపుకు ధర వచ్చే విధంగా చూస్తున్నాం. ఎంత పసుపు వచ్చినా కొనుగోలు చేస్తున్నాం. మహారాష్ట్రలాగానే ధర వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం.


 పెట్టుబడి రావడం లేదు..- భూమేశ్వర్‌,రైతు, జక్రాన్‌పల్లి

రెండెకరాలు పసుపు సాగుచేశాను. భారీ వర్షాల వల్ల పసుపు దెబ్బతింది. ఎకరాకు పది క్వింటాళ్లు రావడం లేదు. ఎరువులు, పురుగుల మందులు, కూలీ లకు పెట్టిన డబ్బులు రావడం లేదు. ధరలు లేకపోవడం వల్ల తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వస్తోంది.


ధర పెంచాలి - బాబు, రైతు, లక్ష్మాపూర్‌,  జక్రాన్‌పల్లి మండలం

పసుపు పండించేందుకు రౌతులు ఎంతో గోస పడుతున్నారు. కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ధర లు పెరిగే విధంగా చూడాలి. ఇలాగే ధరలుంటే వచ్చే సంవత్సరం పసుపు సాగు చేసే పరిస్థితి లేదు. ఈ ధర వల్ల పెట్టుబడులకు కూడా డబ్బులు సరిపోవడం లేదు.

Updated Date - 2020-03-13T12:04:52+05:30 IST